మనదేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీబిఎస్ఈ 10 వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అయితే రద్దైన ఈ సీబిఎస్ఈ 10 వ తరగతి పరీక్ష పలితాలను ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా ప్రకటించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్నల్ మార్క్స్ కి 20 మార్క్స్ వేసి..ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా రద్దైన పదవ తరగతి పలితాలను ఇదే ప్రాతిపదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫార్మటివ్ అస్సెస్మెంట్ మార్క్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఫార్మటివ్ అస్సెస్మెంట్ మార్క్స్ ప్రకారం ఇప్పటికే డేటా సిద్ధం చేసింది ప్రభుత్వ పరీక్షల విభాగం. ఇక 5 లక్షల 21 వేల 393 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరూ పాస్ అయినట్టే అని అధికారులు చెబుతున్నారు