వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ .. AP కీలక నిర్ణయం

ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది సర్కార్. ప్రకాశంలో ఆరు, గుంటూరులో 4, ప.గో, కడపలో మూడు, అనంత, కర్నూల్ జిల్లాల్లో రెండు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యాయని పేర్కొంది. 

మరిన్ని కేసులు పెరగొచ్చని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తుంది. బ్లాక్ ఫంగస్ కేసుల్లో చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లను కొనుగోలు చేయనున్న ఏపీ ప్రభుత్వం… ఇప్పటికే బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 15 వేల వయల్స్ ఆర్డర్ పెట్టింది. ఏపీకి 1650 వయల్స్ కేటాయించింది కేంద్రం. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఎపిడమిక్ డిసీజెస్ యాక్టులో చేర్చింది ఏపీ ప్రభుత్వం.

Flash...   ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన - వాతావరణ శాఖ హెచ్చరిక