2118 బ్యాంక్‌ బ్రాంచ్‌లు మూసివేత.. అసలు కారణం ఇదే.. కీలక విషయాన్ని ప్రకటించిన RBI

 Bank Branches: 2118 బ్యాంక్‌ బ్రాంచ్‌లు మూసివేత.. అసలు కారణం ఇదే.. కీలక విషయాన్ని ప్రకటించిన RBI

Bank Branches: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక విషయాన్ని ప్రకటించింది. సమాచార హక్కు చట్టం (RTI) కింద ఒక అంశాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్యాంక్ బ్రాంచులు మూసివేసినట్లు తెలిపింది. ఈ బ్యాంకు బ్రాంచులు శాశ్వతంగా మూసివేసే అవకాశం ఉంది. లేదంటే ఇతర బ్యాంకు బ్రాంచ్‌లుగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. బ్యాంకుల విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంక్ బ్రాంచులు క్లోజ్ కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. ఈ 2118 బ్రాంచుల్లో ఏ బ్యాంక్ బ్రాంచులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1283 బ్రాంచులు ఉండగా, దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 332 బ్రాంచులు ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB) 169 బ్రాంచులు ఉండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 124 బ్రాంచులను, కెనరా బ్యాంక్ 107 బ్రాంచులను, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53 బ్రాంచులను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43 బ్రాంచులను, ఇండియన్ బ్యాంక్ 5 బ్రాంచులు ఉన్నాయి.

కాగా, కేంద్ర సర్కార్‌ గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ పది బ్యాంకులు 4 బ్యాంకులుగా ఆవిర్భవించాయి. దీంతో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగివచ్చింది. కాగా బ్యాంకుల విలీనం వల్ల బ్రాంచులు తగ్గడం బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని, ఉపాధి తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.

Flash...   ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు – మార్గదర్శకాలు 2020