AP కి త్వరలో 9 లక్షల కోవిడ్ టీకాలు


ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం 

ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ బుధవారం ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్‌లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే సింఘాల్‌ తెలిపారు. 3,220 మంది వైద్యులు 104 కాల్‌ సెంటర్‌ ద్వారా టెలీ కన్సల్టెంట్స్‌ ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి 4,800 రెమిడెసివిర్ వయల్స్‌ కేటాయించిందని వెల్లడించారు. మే నెల కోటా కింద 9 లక్షల కోవిడ్ టీకాలు రానున్నాయని పేర్కొన్నారు.  13 లక్షల డోసులు కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఏకే సింఘాల్‌ హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు.

Flash...   వచ్చే ఏడాది ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్.. సంవత్సరానికి రూ.50 లక్షల సంపాదన..