AP లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే.

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజు 20వేలకు పైగా నమోదయ్యే కేసులు తాజాగా తగ్గాయి. గత మూడు రోజులు పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 91,629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 18,767 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 104 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

గడిచిన 24 గంటల్లో 20,109 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, విజయనగరంలో 11, విశాఖలో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 8, కృష్ణలో 8, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, నెల్లూరులో 6, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1580827 ఉండగా, మొత్తం మరణాల సంఖ్య 10,126 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,09,237 ఉండగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 13,58,569 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Flash...   Jagannana Vidya Kanuka - Distribution of school kits - Certain Instructions