AP Budget 2021: లైవ్‌ అప్‌డేట్స్‌..

 

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

►2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు

►బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు

►కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు

►ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు

►బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు

►ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు

►ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు

►మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు

►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

►మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు

►వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు

►విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు

►వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు

►వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు

►వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు

►జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు

►జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు

►వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

►డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

►పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

►వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

►వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

►వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు. 

►వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

►వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

►మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

►అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

►రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

►లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

►ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

►వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

►అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

►వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

►రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు. 

Flash...   Proposal for sanction of Notional Increments to the Special Teachers appointed on fixed pay of Rs.398/-

►వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

►వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

►వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

►విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

►స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

►జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

►జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు.

►ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

►ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

►కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

►ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు

►శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు

►హౌసింగ్‌, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు

►పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు

►ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు

►కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు

►ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు

►ఎంఎస్‌ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు

►పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు

►రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు

►ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు

►వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు

►వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు

►దిశ కోసం రూ.33.75 కోట్లు

►అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు

►వైఎస్‌ఆర్‌ బీమాకు రూ.372.12 కోట్లు

►అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు

►ఇమామ్‌, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు

►పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు

►ల్యాండ్‌ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు

►పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు

►నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు.

కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌: గవర్నర్‌

ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు.

‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌. కొత్తగా కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. తి ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ కోవిడ్‌ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్‌ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్‌ ఆక్సిజన్ తెప్పించాం’’ అని గవర్నర్‌ తెలిపారు.

Flash...   Rescheduling the teacher training programmes - Agastya International Foundation

‘‘ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని’’ గవర్నర్‌ పేర్కొన్నారు.

‘‘జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం. స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చాం. ఇరిగేషన్‌ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించాం.

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. ఈ ఏడాది 3.2 వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ గవర్నర్‌ తెలిపారు.

Flash...   Temporary Deputation to Aided willing staff - orders issued

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించాం. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించాం. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశాం. ఒక స్కిల్‌ వర్శిటీతోపాటు 25 మల్టీ స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం.

రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్‌ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్‌ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని’’ గవర్నర్‌ అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్‌ తెలిపారు. ప్రజలను కోవిడ్‌ నుంచి కాపాడుకోవడం కోసం సర్వశక్తులను వినియోగిస్తామన్నారు. ప్రజలందరూ కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.