ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై సంధిగ్ధత…. 2-3 రోజుల్లో కీలక నిర్ణయం.
ఏపీలో పదోతరగతి పరీక్షలు వాయిదా?
నెల రోజులు వాయిదా వేయాలని కోరిన విద్యాశాఖ
రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఏడో తేదీ నుంచి జరగాల్నిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితల కారణంగా పరీక్షల నెల రోజుల పాటు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది.
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి మొదలు కావాల్సి ఉండగా… ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోగా… దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్నారు.
ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉండడం, కొన్ని పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంతో పరీక్షల ఏర్పాట్లు చేయడం అధికారులకు ఇబ్బందిగా మారినట్లు విద్యాశాఖ తన ప్రతిపాదనలో పేర్కొంది. దీంతో పాటు టెన్త్ పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను సైతం అందులో ప్రస్తావించింది. పదో తరగతి పరీక్షలు వాయిదా పడితే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా… కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా వేశాయి. బిహార్, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కోరింది.
Waiting about the decision….😷😷