CARONA VIRUS: ఈ దేశాల కేసులతో చూస్తే భారతదేశం ఇంకా సురక్షితమైనది అనే చెప్పొచ్చు…!

కరోనా మహమ్మారి అనేక దేశ ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. కేవలం మన భారత దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ కారణంగా సతమతమవుతున్నాయి.

ఈ మహమ్మారిని తరిమికొట్టాలని నిజంగా ఎంతో కష్టం అవుతుంది. ఏది ఏమైనా చెప్పాలంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశం ఇంకా సురక్షితంగా ఉంది అని చెప్పవచ్చు.

ఈ గణాంకాలను చూస్తే తప్పక మీరు కూడా భారతదేశం సురక్షితంగా ఉందని ఒప్పుకుంటారు. ఇక ఈ వివరాలని పూర్తిగా చూస్తే… బెల్జియంలో 10,16 609 కేసులు నమోదయ్యాయి. 24,551 మంది చనిపోయారు. లక్ష మంది జనాభాలో 214 మంది మరణించారు. మరణాల రేటు 2.40% ఉంది. అదే ఇటలీలో 4,11,210 కేసులు నమోదయ్యాయి. 1,22,833 మంది మరణించారు. 3.00% మరణాల రేటు ఉంది.

యునైటెడ్ కింగ్డమ్ లో 44, 50, 578 మంది కరోనా బారిన పడగా 5,81,754 మంది చనిపోయారు. అదేవిధంగా ఇక్కడ చనిపోయిన వారి రేటు చూస్తే 2.90% ఉంది. ఇక యునైటెడ్ స్టేట్స్ లో అయితే 3,27,07, 750 మంది కరోనా బారిన పడగా 5 ,81,7 54 మంది మృతి చెందారు. ఇక్కడ మరణాల రేటు 1.80% ఉంది.

ఇక ఫ్రాన్స్ అయితే 58,38,295 మంది ఇతర బారిన పడ్డారు. 1,06,553 మంది మరణించారు. ఇక్కడ మరణాల రేటు 1.80% ఉంది. అదే విధంగా స్వీడన్ లో కరోనా కేసులు చూస్తే 10,07,792 ఉంటే.. 14,793 మంది కరోనాతో మృతి చెందారు. ఇక్కడ మరణాలు రేటు చూస్తే 1.40% ఉంది.

స్విజర్లాండ్ లో అయితే 6,70,673 మంది కరోనా బారినపడ్డారు. 10,706 మంది మృతి చెందారు. ఇక్కడ మరణాల రేటు చూస్తే 1.60 శాతం ఉంది. ఆస్ట్రేలియాలో అయితే 6,31,076 మంది కరోనా బారిన పడగా 10,382 మంది మృతి చెందారు. ఇక్కడ మరణాల రేటు 1.60% ఉంది.

Flash...   Formative Assessment 1 Question Papers

అదే విధంగా జర్మనీ లో 35, 30, 887 మంది కరోనా బారిన పడితే 84,844 మంది కరుణతో మృతి చెందారు. ఇక్కడ మరణాల రేటు 2.40% ఉంది. భారతదేశం లో 2,26,62,575 మంది కరోనా బారిన పడితే 2,46,116 మంది మృతి చెందారు. ఇక్కడ మరణాల రేటు 1.10% ఉంది.