Corona drug: కరోనాకు POWDER మెడిసిన్.. DRDO ఔషధం 2-DG కి కేంద్రం అనుమతి.

స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో ఉన్న రోగులపై 2-డీజీ బాగా
పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. శరీర కణాల్లో వైరస్ వృద్ధిని సమర్థవంతంగా
అడ్డుకుంటోందని వెల్లడించింది. ఈ మందు పౌడర్‌ రూపంలో లభించనుంది. నీళ్లలో కలిపి
తీసుకోవాల్సి ఉంటుంది. 


కరోనాకు మరో కొత్త మందు వచ్చింది. ఇప్పటి వరకు ఇంజెక్షన్, టాబ్లెట్స్ రూపంలో
మెడిసిన్స్ మార్కెట్‌లోకి.. తాజాగా పౌడర్ రూపంలో ఉండే కొత్త మందు రాబోతోంది.
మనదేశంలో కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి 2-డీజీ ముందుకు భారత ఔషధ
నియంత్రణ మండలి (DCGI) అనుమతి ఇచ్చింది. డీఆర్‌డీవోకు చెందిన ల్యాబ్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలయ్డ్ సైన్స్ (INMAS),
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయరీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా 2-డీజీ
(2 DeOxy-D-Glucose) డ్రగ్‌ను తయారు చేశాయి. ఔషధం తీసుకున్న తర్వాత కరోనా రోగులు
త్వరగా కోలుకుంటున్నారని.. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం
లేకుండా చేస్తోందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. తద్వారా రోగుల ప్రాణాలను
కాపాడవచ్చని పేర్కొన్నారు. 


స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో ఉన్న రోగులపై 2-డీజీ బాగా పనిచేస్తుందని
డీసీజీఐ తెలిపింది. శరీర కణాల్లో వైరస్ వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటోందని
వెల్లడించింది. ఈ మందు పౌడర్‌ రూపంలో లభించనుంది. నీళ్లలో కలిపి తీసుకోవాల్సి
ఉంటుంది. 2-డీజీపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని
డీఆర్డీవో వెల్లడించింది. మందును వాడిన కొన్ని రోజుల్లోనే కోవిడ్ రోగులు
కోలుకున్నారని.. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని పేర్కొంది.


గత ఏడాది ఏప్రిల్‌లో డీఆర్డీవో-ఇన్మాస్ శాస్త్రవేత్తలు, సీసీఎంబీ సహకారంతో
ల్యాబొరేటరీ ప్రయోగాలు చేశారు. కరోనా వైరస్ వృద్ధి 2-డీజీ సమర్థవంతంగా
అడ్డుకుంటుందని గుర్తించారు. ఆ పరిశోధనల ఆధారంగా మనదేశంలో ఫేజ్-2 ట్రయల్స్‌కు
మేలో అనుమతి ఇచ్చింది డీసీజీఐ. ఫేజ్-2లోనూ ఆశాజనక ఫలితాలు రావడంతో.. గత ఏడాది
డిసెంబరు నుంచి మార్చి, 2021 వరకు మూడో దశ ప్రయోగాలు చేశారు. ఢిల్లీ, యూపీ,
పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్నాటక,
తమిళనాడులోని 27 ఆస్పత్రుల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఆ ఫలితాల
ఆధారంగా 2డీజీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

An anti-COVID-19 therapeutic application of the drug 2-deoxy-D-glucose (2-DG) has been developed by INMAS, a lab of DRDO, in collaboration with Dr Reddy’s Laboratories, Hyderabad. The drug will help in faster recovery of Covid-19 patients. https://t.co/HBKdAnZCCP pic.twitter.com/8D6TDdcoI7

— DRDO (@DRDO_India) May 8, 2021

Flash...   5 రాష్ట్రాల అసెంబ్లీ పోరుకు తేదీలు ఖరారు చేసిన ఈసీ