Covid Vaccination : టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

 టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! లేదంటే ప్రమాదంలో పడే అవకాశం.. తెలుసుకోండి..

Corona Vaccination : దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 2021 జనవరి 16 న ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్ చేపట్టింది. తరువాత లక్షలాది మందికి టీకాలు వేశారు. ఇప్పుడు మూడో దశలో ‘టీకా ఫర్ ఆల్’ డ్రైవ్‌ కింద 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తుంది. అయితే దీని విషయంలో చాలామందికి చాలా అపోహలున్నాయి. టీకా వేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. టీకాలు వేయడం అంటే మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని కాదు. ఒకవేళ రోగం వచ్చినా ఏం కాకుండా ఉండటానికి వేస్తున్నారు. టీకా వేసుకోన వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చాలా అవసరం.

2. టీకా వేసుకుంటే అలర్జీలు వస్తున్నాయనడంలో నిజం లేదు. మిమ్మల్ని పరీక్షించిన తర్వాతే టీకా వేస్తారు.

3. టీకాలు వేసిన తరువాత మీరు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ప్రజల నుంచి 6 అడుగుల దూరంలో ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. డోర్క్‌నోబ్స్, కిచెన్ కౌంటర్‌, ట్యాప్‌ హ్యాండిల్స్ వంటి వాటిని సానిటైజ్ చేయండి.

4. టీకాలు వేసిన తర్వాత మీరు కోవిడ్ లక్షణాలను గమనించినట్లయితే కంగారుపడొద్దు. వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుంది.

5. టీకా తర్వాత కొన్ని రోజులు మీకు తలనొప్పి, జ్వరం, చలి, అలసట, చేతి నొప్పి వంటి దుష్ప్రభావాలు రావచ్చు. డాక్టర్ సూచించిన మందులు తీసుకొని విశ్రాంతి తీసుకోండి. వేడి వేడి సూప్‌లు తాగండి. ఇంకా ఏమైనా సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించండి.

6. టీకా వేసుకున్నాక కఠినమైన పనులు చేయకండి. కొన్ని రోజులు మద్యం, ధూమపానం మానుకోవడం సురక్షితం.

Flash...   Non Faculty Jobs: ఎయిమ్స్ లో 357 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...