INDIA లో కాస్త తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో

 ఇండియాలో కాస్త తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో


మన దేశంలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా.. ప్రభావం కనిపించడం లేదు. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్త‌గా 3,43,144 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య  2,40,46,809 కి చేరింది.  ఇందులో 2,00,79,599 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,893       కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4000 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,62,317 కి చేరింది.  ఇక 24 గంటల్లో  3,44,776 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం

Flash...   ఏపీలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... ముఖ్యాంశాలు ఇవిగో