KRISHNAPATNAM ANANDAYYA AYURVEDA MEDICINE: UPDATES

ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం

నెల్లూరు 10.06.2021: ఆనందయ్య మందుకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఉచిత మందు పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. అన్ని జిల్లాల్లో పంపిణీకి సహాకారం అందివ్వాలని సీఎం జగన్, గవర్నర్లకి ఆనందయ్య లేఖలు రాసినా స్పందన కరవైంది. ఆనందయ్యతో మందు తయారు చేయించేందుకు  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పోటీపడుతున్నారు. తమకే ముందుగా మందు తయారీ చేయించాలంటూ పోటీకి దిగారు. మందు తయారీ విషయంలో వైసీపీలో విభేదాలు చోటు చేసుకుంటున్నారు. రెండు రకాల మందులు తయారు చేశారని వైసీపీ ముస్లిం మైనార్టీ నేత సమీ అన్నారు. ఉచితంగా మందు పంపిణీ చేస్తుండగా అనుమతులు లేవని అధికారులు అడ్టుకుంటున్నారని…ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే అని సమీ ఆరోపించాు. ఆనందయ్య మందుకి గిరాకీ ఉండటంతో ఇదే అదునుగా కేటుగాళ్లు రూ.వేలకి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం నెలకొంది

ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి. 

రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ

ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారు

త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ

ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి


07.06.2021: సాక్షి, నెల్లూరు జిల్లా: గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు.

‘‘ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్‌ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ మందు వాడాలి. కోవిడ్‌ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్‌ మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని’’ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

jagapathi babu: ఆనందయ్య మందు తీసుకున్నా!

07.06.2021: హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తాను ఎప్పుడో తీసుకున్నానని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ఇటీవల జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆనందయ్య తయారు చేసిన ఔషధం పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

‘‘ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు వాడిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా. ఆయుర్వేద తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాత అంతా మంచే జరుగుతుందని డోస్‌ తీసుకున్నా. ఇప్పటివరకూ నాకెలాంటి కరోనా రాలేదు’’ అని జగపతిబాబు అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆనందయ్య మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఔషధం ఇస్తామని, స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సూచిస్తున్నారు. 

ఆన్ లైన్ లో ఆనందయ్య మందు..!

03.06.2021: నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఎవరూ మందు కోసం కృష్ణపట్నం వెళ్లనవసరం లేదు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికే వస్తుంది. అందుకోసం వెబ్ సైట్ కూడా రెడీ చేసింది ప్రభుత్వం. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్ సైట్ www.childeal.in (under construction now)

ఇక పై మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిస్తారు. పోర్టులోని సీవీఆర్ ఫౌండేణ్ లో మందు తయారీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి మందు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనుంది.

ఆనందయ్య ఐ డ్రాప్స్ అనుమతిలో మరో ట్విస్ట్

ఆనందయ్య ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం. రోజుకి 15 నుంచి 20 మంది మాత్రమే ఐ డ్రాప్స్ అత్యవసరం అని వస్తున్నారని పేర్కొన్నారు ఆనందయ్య న్యాయవాది అశ్వని కుమార్. ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని, అలా అని నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వమని చెప్పింది ప్రభుత్వం. ఆనందయ్య మందులో ఐ డ్రాప్స్ విషయంలో తప్ప మిగతా అన్నిటికీ ప్రభుత్వం అనుమతి ఇచిందన్న కోర్టు.. 3 వారాల సమయం ఖచ్చితంగా కావాలని అంతకు ముందు నివేదిక వచ్చే అవకాశం లేదని, ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపింది ప్రభుత్వం. దీనిపై ఆర్డర్స్ రిజర్వ్ చేసింది హైకోర్టు

*బిగ్ బ్రేకింగ్*

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం  ఆనందయ్య ముందుకు గ్రీన్ సిగ్నల్.

ఆనంద‌య్య మందుకు అనుమ‌తి ఇస్తారా? లేదా? అంటూ గ‌త కొంత‌కాలంగా కొన‌సాగుతోన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. మొత్తానికి ఆనంద‌య్య క‌రోనా మందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. అయితే, ఇదే స‌మ‌యంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమ‌తి నిరాక‌రించింది.. ఆనంద‌య్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం.. ఏపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక‌లు రావాల్సి ఉన్నందున‌.. ప్ర‌స్తుతానికి ఆ మందుకు అనుమ‌తి నిరాక‌రించింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన నివేదిక‌లు అన్ని. ఆనంద‌య్య మందు వ‌ల్ల హాని లేద‌ని తేల్చేశాయి.. కాగా, మొత్తం ఐదు ర‌కాల మందులు త‌యారు చేస్తూ వ‌చ్చారు ఆనంద‌య్య‌.. అందులో కంట్లో వేసే మందుకు మాత్రం ఇప్పుడు బ్రేక్ ప‌డ‌గా.. మిగ‌తా నాలుగు మందులు త‌యారు చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్టు అయ్యింది.

అయితే, ఆనంద‌య్య మందుతో హానిలేద‌ని నివేదిక‌లు తేల్చినా.. ఆ మందు వాడితే కోవిడ్ త‌గ్గుతుంద‌న‌డాకి నిర్ధార‌ణ లేద‌ని నివేదికలో పేర్కొన్నారు. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక రావ‌డానికి మ‌రో 2-3 వారాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది ఏపీ స‌ర్కార్.. ఇదే స‌మ‌యంలో.. ఆనంద‌య్య మందు తీసుకోవ‌డానికి కోవిడ్ రోగులు రావొద్దు అని స్ప‌ష్టం చేసింది.. కోవిడ్ రోగుల బంధువులు వ‌చ్చి మందు తీసుకెళ్లాల‌ని సూచించింది. ఇక‌, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసేంది.. ప్ర‌స్తుతానికి అయితే.. ఆనంద‌య్య ఇచ్చే పీ, ఎల్‌, ఎఫ్ మందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.

Flash...   Amazon Sale:అమెజాన్ సేల్‌లో ఏకంగా 75 %  డిస్కౌంట్..  ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయో తెలుసా... !

◆ కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, *ఆనందయ్య* ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.

◆ *కె* అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి  నిరాకరణ.

◆ ఆనందయ్య ఇచ్చే *పి, ఎల్, ఎఫ్‌* మందులకు గ్రీన్‌ సిగ్నల్‌.

◆ సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.

◆ కంట్లో వేసే మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు.

◆ ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలు.

◆ *సీసీఆర్‌ఏఎస్‌* నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని తేల్చిన నివేదికలు.

కానీ……

ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు.

◆ *కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది:*

నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం.

*ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి*

డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ, ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు.

★ ★ *ఆనందయ్యమందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం.*

వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్రప్రభుత్వం

*●●●మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌పాటించాలి*


ఆనంద‌య్య మందుకు నెల‌రోజులే స‌మ‌యం… ఎందుకంటే…

30.05.2021: ఆనంద‌య్య మందును ఈ నెల 21 వ తేదీన ప్ర‌భుత్వం నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.  మందుపై ప్రస్తుతం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  మ‌రో రెండు మూడు రోజుల్లో నివేదిక‌లు అందిన త‌రువాత‌, పంపిణీపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.  అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామ‌రడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్క‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌లు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.  మూడు నెల‌ల‌పాటు మాత్ర‌మే బ‌తికి ఉంటాయి.   ఈ మొక్క‌లు మ‌రో నెల రోజులు మాత్ర‌మే అదుబాటులో ఉంటాయి.  నెల రోజులు మాత్ర‌మే మందు అందుబాటులో ఉంటుంది.  ఆ త‌రువాత ఈ మందు త‌యారి అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. 

Krishnapatnam Anandaiah: మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య.. రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు.. ప్రముఖుల
ఒత్తిడియే కారణమా.. !

 కరోనా నివారణ అంటూ నాటు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు
రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తు
మధ్య ఆయన్ను తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆనందయ్య ఔషధం కోసం
ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి
నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం
తెలిసిందే.

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఇప్పటికే
విధించిన 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే
వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్టు సమాచారం. నెల్లూరు, ముత్తుకూరు
నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర
ప్రాంతాల నుంచి వచ్చేవారినీ అనుమతించడంలేదు

కాగాచ కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు
చేసిన మందుపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తయింది. అయితే మందుకి
సంబంధించిన నివేదికను ఇవాళ తయారు చేసే అవకాశముంది. అన్ని రిపోర్టుల్ని
కూలంకుశంగా పరిశీలన చేస్తామన్నారు ఆయుష్ కమిషనర్ రాములు. ఇప్పటి వరకు వచ్చిన
రిపోర్ట్‌లలో ఎలాంటి ఇబ్బంది లేదని.. మందు విషయంలో సీఎం కూడా సానుకూలంగా
ఉన్నారని అన్నారాయన.

ఎట్టకేలకు కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరుకున్నాడు ఆనందయ్య. అలాగే మందు
పంపిణీ పై క్లారిటీ ఇచ్చారు. మందు పంపిణీ జరగడం లేదని.. ప్రభుత్వం నుంచి
అనుమతి వచ్చాక పంపిణీ ఉంటుందన్నారు. కాగా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా జాగ్రత్తలు
తీసుకోవడంలో ఆలస్యం అవుతుందంటోంది ఆయుష్ విభాగం. మందుపై కోర్టు ఆదేశాలు ఎలా
ఉండబోతాయి.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా
మారింది


ఆనంద‌య్య మందు తీసుకున్న‌వారు ఎవ‌రూ చ‌నిపోలేదు..!

26.05.2021 8.00 PM:క‌రోనా క‌ల్లోలం
సృష్టిస్తున్న స‌మ‌యంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌రోనా బాధితుల‌ను
ప‌ట్టిపీడిస్తున్నాయి.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్లు కూడా దొర‌క‌ని
ప‌రిస్థితి.. అప్పుడే.. అంద‌రికీ నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన
ఆనంద‌య్య క‌న‌బ‌డ్డాడు.. ఆయ‌న త‌యారు చేసిన క‌రోనా మందును వేలాది మంది
తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేయాల‌ని ప్ర‌భుత్వం
నిర్ణ‌యించింది.. ఓవైపు ఇంకా అధ్య‌య‌నం కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు..
ఆనంద‌య్య ఇచ్చిన మందు తీసుకున్న‌వారు చాలా మంది ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల
బారిన‌ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.. అందులో 88 మంది నెల్లూరులోని
జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నార‌ని చెబుతున్నారు. అయితే, దీనిపై జీజీహెచ్
కోవిడ్ నోడ‌ల్ ఆఫీస‌ర్ న‌రేంద్ర కాస్త క్లారిటీ ఇచ్చారు..

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 88 మంది ఆనందయ్య మందు వాడి ఉండొచ్చు అని
వ్యాఖ్యానించిన నోడ‌ల్ ఆఫీస‌ర్ న‌రేంద్ర‌…. అయితే, వాళ్లంతా ఆనందయ్య మందు
వాడారని ఖచ్చితంగా చెప్పలేం అన్నారు.. కానీ, గుచ్చిగుచ్చి అడిగితే కొందరు
చెబుతున్నారు.. మ‌రికొంద‌రు చెప్పడం లేద‌ని తెలిపారు.. ఇక‌, వీరిలో కొందరికి
స్వల్పంగా కంటి సమస్యలు వచ్చి త‌గ్గిపోయాయ‌ని.. ప్ర‌స్తుతం ఎవరికీ ఎలాంటి
ఇబ్బంది లేద‌న్న ఆయ‌న‌.. ఆనందయ్య మందు వాడిన‌వాళ్లు ఎవ‌రూ జీజీహెచ్‌లో
చనిపోలేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు.. కోటయ్య ఆరోగ్యం నిలకడగా ఉంది.
చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు.. ఆయనలోని కంటి సమస్య తొలగిపోయిన‌ట్టు
వెల్ల‌డించారు న‌రేద్రం.

ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ

27.05.2021, 2.30 PM: ఆనందయ్య కరోనా
మందుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆనందయ్య.. ఆయుర్వేద
కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. మందుపై పరీక్షలు
జరుపుతున్నామన్న ప్రభుత్వం.. ఫైనల్ రిపోర్ట్స్ ఈనెల 29న వస్తాయని
వెల్లడించింది. ప్రజలు మందుకోసం ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా రిపోర్ట్
తెప్పించుకుని నిర్ణయం తీసుకోండని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్లుండి
ఆనందయ్య మందుపై తుదినిర్ణయం రానుంది.

సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్య తరలింపు.. ఆందోళనలో బంధువులు.

27.05.2021 10 AM:

నెల్లూరు  జిల్లాలోని కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి
ఆనందయ్యను పోలీసులు తరలించారు. కాగా ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో
బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్
కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో
వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం
వ్యక్తం చేస్తున్నారు.

Anandayya Natumandu: ఆనందయ్య నాటు మందుతో దుష్పరిణామాలు.. నెల్లూరు
ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..?

Flash...   లాక్‌ డౌన్‌పై నడుస్తున్న బెట్టింగ్‌లు..మే 2 నుండి లాక్ డౌన్ ఉంటుందని భారీగా బెట్టింగ్ లు

TV9 STORY:26.05.2021

Anandayya Natumandu Side Effects: ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్‌ పరిశోధన ఎటూ
తేలడం లేదు. ప్రస్తుతానికి మందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు
సేకరిస్తున్నారు అధికారులు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ
అభిప్రాయ సేకరణలో అవరోధాలు ఎదురవుతున్నాయి. మందు వాడిన 500 మందిని ఫోన్‌
ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అధికారులు. వారిలో 92 మంది ఫోన్‌ లిఫ్ట్
చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 42 మంది మందే తీసుకోలేదని చెప్పారు. 36
మంది రోగుల జాబితాలో ఒకటే ఫోన్‌ నెంబర్ ఉంది.

మందు తీసుకున్న వారిలో ఎక్కువ మంది కరోనా రాకముందే మందు తీసుకున్నట్టు
వెల్లడైంది. ఇప్పటి వరకూ మందు తీసుకున్న వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో..
మరిన్ని నెంబర్లు పంపాలంటూ నెల్లూరు అధికారులను కోరారు వైద్యులు. రోగుల నుంచి
పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తేనే తర్వాత పరిశోధన ఉంటుందన్నారు వైద్యులు. దీంతో
ఈ ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి.. మరికొంత ఆలస్యం అవకాశం
ఉంది.

మరోవైపు, కరోనా నివారణ పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య
ఇచ్చిన నాటుమందుతో పలువురు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నెల్లూరు
ప్రభుత్వ ఆసుపత్రిలో 36 మంది ఈ మందు తీసుకున్న తరువాత చోటుచేసుకున్న
దుష్పరిణామాలకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వీరిలో పలువురికి ఆక్సిజన్‌
స్థాయి ప్రమాదకరంగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వీరికోసం ప్రత్యేకంగా ఒక
వార్డును ఏర్పాటు చేసి మరీ చకిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే శుక్రవారం ఈ మందు తీసుకున్న వారిలో ఆరుగురు మరణించారు. మృతి
చెందిన వారిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి కూడా తీసుకువచ్చినట్లు తెలిసింది.
అప్పటికే మరణించి ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకోకుండా వారిని వెనక్కి పంపినట్లు
సమాచారం. ఆస్పత్రిలో చనిపోతే మార్చురీలో ఉంచి, విఆర్‌ఒ సంతకం చేసిన తరువాతే
మృత దేహాలను బంధువులకు ఇస్తారు. అలా జరగకపోవడంతో వీరికి సంబంధించిన
రికార్డులు కూడా ఆస్పత్రిలో లేవు. ఇదే విషయాన్ని ప్రముఖ విశ్లేషకులు
తెలకపల్లి రవి.. తన తెలకపల్లి మీడియా ద్వారా వెల్లడించారు

అయితే, మరణించిన వారు పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరిజిల్లాలకు
చెందిన వారని సమాచారం. ఆనందయ్య నాటుమందు గురించి జరిగిన ప్రచారంతో
అంబులెన్స్‌ల్లో వీరిని తీసుకువచ్చారని, మందు తీసుకున్న తరువాత పరిస్థితి
మెరుగుపడకపోగా, మరింతగా విషమించడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారని
తెలిసింది. అప్పటికే పరిస్థితులు చేయిజారి పోవడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యులు
సైతం ఏమీ చేయలేకపోయారు. నాటుమందు పంపిణీ వివాదాస్పదంగా మారడంతో ఈ విషయం
గురించి ఆస్పత్రి సిబ్బంది పెదవివవిప్పడం లేదు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్న
ఆనందయ్య నాటుమందు బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన
కలిగిస్తోంది.

మరోవైపు, ఆనందయ్య నాటు మందు బాధితులు క్రమంగా పెరుగుతుండంతో అధికారులు
ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపినట్లు తెలిసింది. ముఖ్యంగా రిటైర్డ్
హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్య స్థితితో పాటు, మిగిలిన వారి ఆరోగ్య సమస్యలను
కూడా వివరించినట్లు తెలిసింది. అయితే, ఈ పరిణామాలను బహిరంగంగా ప్రకటించడానికి
గానీ, మీడియాకు చెప్పడానికి గానీ అధికారులు ముందుకు రావడం లేదు. మొత్తం
విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. –TV9 STORY 


ఆనందయ్య మందుపై TTD  సర్వే పూర్తి

570 మందిపై సర్వే చేసిన కమిటీ

80 శాతం మంది ఆనందయ్య మందుపై సానుకూల స్పందన

సీసీఆర్‌ఏఎస్‌కు నివేదిక సమర్పించిన టీటీడీ. 

26.05.2021: సాక్షి, తిరుపతి: ఆనందయ్య
మందుపై టీటీడీ కమిటీ సర్వే పూర్తి అయ్యింది. 570 మందిపై కమిటీ సర్వే చేసింది.
80 శాతం మంది ఆనందయ్య మందుపై సానుకూల స్పందన వచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌కు
టీటీడీ కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులు డా.రేణుదీక్షిత్
ఆధ్వర్యంలో సర్వే జరిపారు. తిరుపతి సుజన్‌ లైఫ్ ల్యాబ్‌లో ప్రీ క్లినికల్‌
ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌ లైఫ్ సైన్స్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రేపటి నుంచి సుజన్‌
ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌
లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.

26.05.2021: టాలీవుడ్ నటులు జగపతి బాబు
ఆనందయ్యకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆనందయ్యను
చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది
అని జగపతి బాబు అభిప్రాయపడ్డారు

అన్ని పరిశీలనల తరువాత ఆనందయ్యగారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని
ప్రార్థిస్తున్నాను అన్నారు జగపతి బాబు. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ రకంగా
దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి అంటూ ట్వీట్ చేశారు. 


ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం…

25.05.2021.: ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది
వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద
ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్ ఆదేశాలు మేరకు మందు
వేసుకున్న 500 మంది వివరాలు సేకరిస్తూన్నాం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా
పరిశోధన జరుగుతుంది. ఏక్కువ మంది ముందస్తూగా మందును వేసుకున్నారు. అదనంగా మరో
200 మంది వివరాలను అందించాలని జిల్లా యంత్రాగాని కోరాం. ఇవాళ రాత్రికి
సిసిఆర్ఏఏస్ కి పరిశోధన నివేదిక సమర్పిస్తాం అని తెలిపారు. మరో రెండు, మూడు
రోజులలో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం సిసిఆర్ఏఏస్ నివేదిక
సమర్పిస్తుంది అని పేర్కొన్నారు.

నందయ్య మందుని కరోనా థర్డ్ ఫేజ్ లో అనుమతిస్తారా…? సోమిరెడ్డి

25.05.2021.: ఆనందయ్య మందు పంపిణీ ఎవరు అడ్డుకున్నా దుర్మార్గం. ఆనందయ్య తో బలవంతంగా మందు
తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు
పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో
మాట్లాడిన ఆయన… అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కృష్ణపట్నం వచ్చే వారిని
పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు…ఆయన్ని
ప్రజలు కాపాడుకుంటారు. సెకండ్ ఫేజ్ లో ప్రజలు చనిపోతుంటే….ఆనందయ్య మందుకి
కోవిడ్ థర్డ్ ఫేజ్ లో అనుమతి ఇస్తారా… మందు తయారీకి ప్రభుత్వం రేపటి నుండి
అనుమతి ఇవ్వాలి అని తెలిపారు. ఆనందయ్య మందు కి ఎమ్మెల్యే బొమ్మలు వేసుకుని
పంచుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పలేక పోతున్నాడు. ఆనందయ్య విషయం ఒక్క
సర్వేపల్లికి సంబంధించింది కాదు….జిల్లా మంత్రులుకు ప్రజల ప్రాణాలు కాపాడే
గడ్స్ లేవా.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా…లేదా…అని అనుమానం
కలుగుతోంది. మందు పంపిణీ చేతకాదని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
చెబితే….ఆనందయ్య మందు మేము పంపిణీ చేస్తాం. ఒక ఎమ్మెల్యేని కాదని ఒక ఊరికి
వెళ్లే ధైర్యం మంత్రులు, అధికారులకు లేదు అని పేర్కొన్నారు.


ఆనందయ్య మందుపై కొనసాగుతున్న సీసీఆర్ఏఎస్ పరిశోధన. 

25.05.2021.: ఆనంద‌య్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న‌ది.  ప్ర‌స్తుతం
ఆనంద‌య్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ‌, తిరుప‌తిలోని
ఆయుర్వేద క‌ళాశాల‌లో ప‌రిశోధ‌న కొన‌సాగుతోంది.  కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య
దగ్గ‌ర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివ‌రాలు సేక‌రిస్తున్నారు
వైద్య‌లు.  నిన్న‌టి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు
సేక‌రించారు.  అయితే, ఫోన్ ద్వారా వివ‌రాలు సేకరించే స‌మ‌యంలో
వైద్యుల‌కు సాంకేతికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్టు వైద్యులు
తెలిపారు.  కొంత‌మంది రోగులు స్థానిక ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల నెంబ‌ర్లు
ఇచ్చిన‌ట్టు వైద్యుల దృష్టికి వ‌చ్చింది.  క‌రోనా రాకుండా ముందు
జాగ్ర‌త్త‌గా మందు తీసుకున్న వారే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు వైద్యులు
గుర్తించారు.  క‌రోనా వ‌చ్చిన త‌రువాత మందు తీసుకొని ఉంటే, ఫ‌లితాలు
తెలుసుకునే వీలుంటుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  మ‌రిన్ని
ఫోన్ నెంబ‌ర్లు సేక‌రించి పంపించాల‌ని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని
ఆయుర్వేద వైద్యులు కోరారు.  క‌రోనా వ‌చ్చి మందు తీసుకున్న వారు క‌నీసం
500 మందిని విశ్లేషిస్తేనే మందు ప్ర‌భావంపై ప్రాథ‌మిక నిర్ధార‌ణ చేయ‌వ‌చ్చ‌ని
అంటున్నారు

Flash...   Oral Cancer : స్మార్ట్ ఫోన్ తో నోటి క్యాన్సర్ గుర్తించవచ్చు.. ప్రత్యేక మొబైల్ యాప్

ఆనందయ్య మందు’ పంపిణీ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతి

25.05.2021.: అమరావతి: ఆనందయ్య మందు పంపిణీ చేయాలంటూ దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు
హైకోర్టు అనుమతించింది. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ
చేపట్టనుంది. మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని
పిటిషనర్లు కోరారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి
చేశారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ నిలిపివేశామని పోలీసులు
చెబుతున్నారని, కానీ లోకాయుక్తకి ఆ అధికారం లేదని పిటిషనర్ పేర్కొన్నాడు.
మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. 

25.05.2021  12 AN

ఆనందయ్య మందుపై ఫలితాలు రాగానే నిర్ణయం

ఆనందయ్య మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

శాంపిళ్లను సీసీఆర్‌ఏఎస్‌కు పంపామన్న ఆయుష్‌ కమిషనర్‌ 

కంట్లో డ్రాప్స్‌పైనా నిపుణులతో పరిశీలన 

అధికారులకు సీఎం ఆదేశం 

25.05.2021.: సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు
సంబంధించి ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌’
(సీసీఆర్‌ఏఎస్‌)కు పంపిన శాంపిళ్ల ఫలితాలు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం
వైఎస్‌ జగన్‌ అన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, చికిత్సపై ముఖ్యమంత్రి సోమవారం
తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
కృష్ణపట్నం ఆనందయ్య మందులో వినియోగిస్తున్న పదార్థాల గురించి రాష్ట్ర ఆయుష్‌
కమిషనర్‌ రాములు ముఖ్యమంత్రికి వివరించారు. ఆనందయ్య మందుల్లో కంట్లో వేసే
డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం
ఆదేశించారు. కంట్లో డ్రాప్స్‌పై పరిశీలన ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం
తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆనందయ్య మందుల శాంపిళ్లను
ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, కొన్ని పరీక్షల
ఫలితాలు రావాల్సి ఉందని కమిషనర్‌ వివరించారు. ఈ మందు శాంపిళ్లను
సీసీఆర్‌ఏఎస్‌కు పంపామని, వాళ్లు 500 మందికి ఇచ్చి పూర్తిస్థాయి పరిశీలన
చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మందు వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?
లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో
నివేదిక వస్తుందని అధికారులు చెప్పారు.

30–35 ఏళ్లగా మందులు ఇస్తున్నారు

కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందులు ఇస్తున్నారని ఆయుష్‌
కమిషనర్‌ రాములు సమావేశంలో తెలిపారు. కరోనాకు నోటి ద్వారా 4 రకాల మందులు,
కళ్లలో డ్రాప్స్‌.. ఇలా 5 రకాల మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ మందుల్లో
ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని చెప్పారు. పసుపు,
జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె.. ఇలా 18 రకాలను ఆనందయ్య 5 రకాల
మందుల్లో వాడుతున్నారని వివరించారు. అన్నీ సహజంగా దొరికే పదార్థాలేనని, వేరే
ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని చెప్పారు. మందుల తయారీ విధానాన్ని తమకు
చూపించారని, ఫార్ములా కూడా చెప్పారని తెలిపారు

🔹తయారు చేసిన మందు అయిపోయింది

🔹మూలికలు, పదార్ధాల సేకరణకు 2-3 రోజులు పడుతుంది

🔹కరోనా ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమ నిర్వహకుడు ఆనందయ్య.

24.05.2021.: సాక్షి, నెల్లూరు :
ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్ది భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందును
పంపిణీ చేశామని ఆనందయ్య తెలిపారు. తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ
నిలిపివేశామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్ధాలు
సేకరించడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి
కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకే మందు పంపిణీ ప్రారంభించాం: ఎమ్మెల్యే కాకాని

ఆనందయ్య వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నివారణకు కూడా
ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది.
భౌతిక దూరం పాటించని అంశాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కరోనాతో ఆక్సిజెన్ లెవల్స్ తగ్గిన వారికి కంట్లో డ్రాప్స్ వేయడం మంచి ఫలితాలను
ఇచ్చింది. అందుకే మందు పంపిణీ ప్రారంభించడం జరిగింది. 

రద్దీ కారణంగా పంపిణీ సవ్యంగా సాగలేదు. సీఎం జగన్ కూడా దీనిపై సమీక్ష చేశారు.
ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. ఐసీఎంఆర్‌ బృందం కూడా నెల్లూరు
రానుంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ర్టాల
నుంచి ఎవరూ రావద్దు. ఆన్‌లైన్‌లో సర్వీస్ కూడా చేపట్టాలని అనుకుంటున్నాo’’.

 కృష్ణపట్నం ఆయుర్వేదం ఆనందయ్యను  తీసుకెళ్తున్న దృశ్యం .

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి,జనం అధిక సంఖ్యలో గుమిగూడడానికి కారణమయ్యాడని..
కేసు నమోదు చేసి,వివరణ కోరిన జిల్లా SP.

నెల్లూరు: జనం ఎక్కువగా గుమిగూడారని ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు. ఈ
రోజు రాత్రికి ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం రానుంది. అయితే ఆనందయ్య మందుకు
రెండ్రోజుల్లో అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు కొరియర్ ఛార్జీలు భరించి.. తాము మందు పంపుతామని
చెప్పారు. కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న
కరోనాకు అక్కడ ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదంపై ఉన్న
పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం
తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు
పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.
దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని
స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.

కరోనా రోగులకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న బొనిగి ఆనందయ్యను అరెస్ట్
చేశారంటూ వాస్తున్న వార్తలపై స్పందించారు నెల్లూరు జిల్లా ఎస్పీ. ప్రస్తుత
పరిస్ధితుల దృష్ట్యా ఆనందయ్యకు అనదపు భద్రత కల్పించామని ఆయన స్పష్టం
చేశారు.