KRISHNAPATNAM Corona Medicine: ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?

 ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ.


ఆనందయ్య మందును ఆయుర్వేధంగా గుర్తించే అవకాశం ఉన్నట్టు ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆనందయ్య మందుపై తుది అధ్యయనం జరుగుతోందని, నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేధంగా గుర్తించవచ్చని రాములు పేర్కొన్నారు.  ఆనందయ్య మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని, ఆయుర్వేధంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉందని, కానీ కేంద్రం సాయం తీసుకుంటామని రాములు పేర్కొన్నారు.  అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది కాబట్టి ప్రస్తుతానికి ఆనందయ్య మెడిసిన్ ను ఆయుర్వేధంగా గుర్తించలేమని  ఆయుష్ కమిషనర్ తెలిపారు.  

మందు తయారీ విధానాన్ని బహిరంగ పరిచేందుకు ఆనందయ్య అంగీకరించారని, ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్ లో కూడా ఎలాంటి హానికరాలు లేవని అన్నారు.  తేనె, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐడ్రాప్స్ తయారు చేస్తున్నారని, ఐ డ్రాప్స్ వలన ఇబ్బందులు ఉండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్ధారించినట్టు ఆయుష్ కమిషనర్ తెలిపారు.  గతంలో ఆనందయ్య ఎవరెవరికి మందులు ఇచ్చారో వారి డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.  జిల్లేడు పువ్వులను శాస్త్రప్రకారం ఉపయోగిస్తే మందుగా ఉపయోగించవచ్చని అన్నారు.  ఆనందయ్య మందు వాడాక కొందరికి ఇబ్బందులు వచ్చాయని తెలిసిందని, అయితే, మందు తీసుకున్నాక ఫాలో కావాల్సిన నియమాలు ఫాలో అయ్యారో లేదో చూడాల్సి ఉంటుందని అన్నారు.  కృష్ణపట్నం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, కరోనా డెత్స్ లేవని తెలిపారు.  ఈరోజు సాయంత్రం వరకు నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు 

నెల్లూరు జిల్లాలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందు తెలుగు
రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు ఆనందయ్య మందుతో కరోనా ఖతం
అవుతుందనే ప్రచారంతో యావత్‌ దేశం ఏపీ వైపు చూస్తోంది. ఆనందయ్య మందు కోసం వేలాది
మంది ఆస్పత్రి ఐసీయూలను వదిలి నెల్లూరుకు క్యూ కడుతున్నారు. వేలాదిగా వస్తున్న
ప్రజలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆనందయ్య తయారు చేసిన మందు
విషయంలో ఆయుర్వేదం వర్సెస్‌ అల్లోపతిగా మారింది సీన్‌. ఆ మందుకు అంత సీన్‌
లేదంటూ అల్లోపతి వైద్యులు కొట్టిపారేస్తున్నారు. చెట్ల ఆకు పసరుతో తయారు చేసే
మందుతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై ఆయుష్
కమిషనర్ రాములు స్పందించారు.

Flash...   Great Offer: Flipkart నుండి 17 వేలకే బ్రాండ్ న్యూ 43 ఇంచ్ 4K UHD టీవీ ఆఫర్.!


ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం.. అది ఆయుర్వేద
మ౦దుగా కాకుండా నాటు మందుగానే పరిగణిస్తామని రాములు అన్నారు. మందు తయారీలో
ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవన్నారు. అలాగని ఆనందయ్య తయారు చేసే మ౦దు హానికరం
కాదని స్పష్టం చేశారు. ఆనందయ్య వాడే పదార్థాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి
వనమూలికలేనని క్లారిటీ ఇచ్చారు. ఆనందయ్య మందుతో కరోనా బాధితులకు ఉపశమనం
లభిస్తున్న మాట వాస్తవమే. అయితే ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదన్నారు
ఆయుష్‌ కమిషనర్‌.


ఆనందయ్య మందుపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయుష్‌ కమిషనర్‌
రాములు చెప్పారు. ఈ మందు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఆనందయ్య తయారీ చేశానని
చెప్పారు. కరోనా కోసమే మందు తయారు చేశానని ఆనందయ్య కూడా ఎక్కడా చెప్పలేదు.
హానికరం కాదు కాబట్టి ..ఆనందయ్య మందు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాకపోతే
ఆయుర్వేద మందు అని పిలిస్తే…ఆయుష్ శాఖ నుండి అభ్యంతరం ఉందని రాములు
తెలిపారు.

నా మందు ఆయుర్వేదమే – ఆనందయ్య


నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా
చర్చకు దారితీసింది.  నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో
పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. 
అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు.  ఈ మందుకు ఎంతవరకు
శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు
పరిశోధన చేయబోతున్నారు.  ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును
పరిశీలించారు.  ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది.  ఈ మందుకు
శాస్త్రీయత ఉందని ఆయా శాఖలు దృవీకరిస్తే మందు పంపిణీకి అనుమతులు
లభిస్తాయి.  అయితే, ఈ మందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.  తనది
ఆయుర్వేద మందు ఐ, ప్రజలకు మేలు చేసేందుకు తయారు చేసినట్టు తెలిపారు. 
ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని అన్నారు.  ప్రభుత్వం పూర్తి సహాయం
అందిస్తుందని, తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, తన మందును అమ్మే
వారిని కట్టడిని చేయాలని ఆనందయ్య పేర్కొన్నారు.

Flash...   Investment in NPS: NPS పెట్టుబ‌డి మెరుగైన రాబ‌డిని ఇస్తుందా?

కరోనాకు ఆనందయ్య మందు పని చేస్తుంది ప్రోత్సహించాల్సిందే !


ఆనందయ్య తయారు చేస్తున్న మందు వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కరోనా చికిత్సకు
ఆనందయ్య మందు పని చేస్తుందని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద యూనివర్సిటీ రిటైర్డ్ వైస్
ప్రిన్సిపల్ భాస్కరరావు స్పష్టం చేశారు. ఆనందయ్యది నాటు మందు కాదు… నాటి మందు
అని..ఆనందయ్య మందును ప్రోత్సహించాలని సలహా ఇచ్చారు. కరోనాకు చేస్తున్న చికిత్సలో
చాలా సార్లు మార్పులు చేశారని..కంట్లో వేస్తున్న మందు వలన కూడా ఎలాంటి ఇబ్బందులు
ఉండవన్నారు. కంటిలో వేస్తున్న మందు వలన పల్స్ పెరుగుతుందని…సైన్స్ కి తల్లి
ఆయుర్వేదమని పేర్కొన్నారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందు యూట్యూబ్ లో చూసి
సొంతంగా తయారు చేసుకోవడం మంచిది కాదని తెలిపారు.