Nasal spray for Carona virus :కరోనా బాధితుల్లో వైరల్‌ లోడును 99 శాతం తగ్గించే నాసల్ స్ప్రే..

కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానో‌టైజ్  రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే  నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్‌ను ఈ నాజల్ స్ప్రే చంపేస్తుందని పేర్కొంది.  శ్వాస నాళాలలో పాగా వేసే వైరస్ ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, తాము అభివృద్ది చేసిన ఈ నాసల్ స్ప్రే అక్కడున్న వైరస్‌ను సమూలంగా నిర్మూలిస్తుందని సంస్థ తెలిపింది.

వైరస్ బారినపడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా 24 గంటల్లోనే 95 శాతం వైరల్ లోడు తగ్గినట్టు గుర్తించారు.72 గంటల్లో 99 శాతం మేర వైరల్ లోడును తగ్గించింది. బ్రిటన్ వేరియంట్‌పైనా ఇది సమర్థంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ  ప్రయత్నిస్తోంది. కాగా, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే దీని వినియోగానికి అనుమతి ఇచ్చాయి.

Flash...   Krishna Collector Orders on Carona spreading in town