Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ.

 Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ. 

Oxygen Pulse Rate: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గజగజ వణికిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆక్సిజన్‌ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అందుకే శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోనే ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియ రేట్లు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకు ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ (CarePlix Vital) యాప్’ను కొల్‌కతాకు చెందిన కేర్‌ నౌ హెల్త్‌కేర్‌ (CareNow Healthcare) అనే అంకుర సంస్థ దీనికి రూపకల్పన చేసింది.

యాప్‌ ఎలా పని చేస్తుంది..?

ఫోటో ఫ్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ, కృత్రిమ మేథ సాయంతో ఈ కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ (CarePlix Vital) యాప్‌ పని చేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌లో కేవలం మన ఫోన్‌లోని ఫ్లాష్‌ ఆధారంగా ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చంటున్నారు సదరు సంస్థ. ఈ యాప్‌ ను తెరచి మన ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచాలి. ఆ తర్వాత స్కాన్‌ అనే బటన్ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో యూపిస్తుందని కేర్‌ నౌ హెల్త్‌ కేర్‌ సహ వ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని వెల్లడించారు. అందులో ఈ యాప్‌ 96 శాతం సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ యాప్‌లో నమోదయ్యే రిపోర్టులను పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Flash...   What is Salary Protection Insurance? what are the Benefits?