SONU SOOD: ఇంటికే ఆక్సిజ‌న్ ఇస్తాం.. సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం

దేశ వ్యాప్తంగా త‌న సేవ‌ల‌తో రియ‌ల్ హీరోగా ముద్ర వేసుకున్నారు సోనూసూద్‌. ఈ క‌రోనా సెకండ్‌వేవ్‌లో ఎంతో మందికి త‌న సాయం అందిస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తానంటూ చెప్పి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నఈ రియ‌ల్ హీరో.. ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తోన్న సోనూసూద్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్ అంద‌క చాలామంది చ‌నిపోతుండ‌టంతో.. దీనికి ప‌రిష్కార మార్గం చూపించారు. ఇక నుంచి ఇంటికే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

కొవిడ్ పేషెంట్ల‌కు ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ కావాల‌నుకుంటే www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, రిక్వెస్ట్ పెట్టాల‌ని కోరారు. దాన్ని ప‌రిశీలించి వెంట‌నే ఆ ఇంటికి సిలిండర్ సరఫరా చేస్తామన్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను కూడా ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆక్సిజ‌న్ కావాల‌నుకున్న వారు దేశంలో ఎక్క‌డి నుంచైనా రిక్వెస్ట్ పంపొచ్చ‌ని వెల్ల‌డించారు.

Flash...   Bajaj bikes: టూ వీలర్ సెగ్మెంట్‌లో బజాజ్ కిల్లర్ ప్లాన్.. తొలిసారిగా ఈ తరహా బైక్స్‌ రిలీజ్