Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ విధింపు.. రేపట్నించే, నిబంధనలివే.

Telangana Lockdown Guidelines: కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్న మీమాంస ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇటీవల సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పారు.

 తెలంగాణలో మే 12 నుంచి లాక్ డౌన్

రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

6 నుంచి 10 వరకూ సడలింపు.

Lockdown Rules in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ వాటిని అదుపు చేసేందుకు ఎట్టకేలకు లాక్ డౌన్ విధించారు. రేపట్నుంచి (మే 12) 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ప్రజలు బయట రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు మినహాయించారు. ఆ తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే, ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా లాక్ డౌన్ ఉండనుంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు కరోనా అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. తమ ఆందోళనకు కూడా కేబినెట్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఏజీకి హైకోర్టు సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్లపైనా చర్చ

తెలంగాణలో వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి టీకా తయారీకి గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ విధిస్తే ఎదుర్కోవాల్సిన అంశాలు, ఇప్పటికే విధించిన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు.

సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్న మీమాంస నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పారు. పలుమార్లు ఇదే విషయం స్పష్టత చేస్తూ వచ్చారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం 10 రోజు ల  పాటు LOCK DOWN  అమల్లో ఉంటుందని చేప్పారు ,

Flash...   Reduced syllabus and Deleted items in CBSE (X & XI,XII) and Inter for 2020-21