VACCINE OFFER : వ్యాక్సిన్ తీసుకుంటే బీరు… 200 డాలర్ల నగదు ఫ్రీ…

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్  మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.  35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు.  ఇందులో 12 కోట్ల మందికి రెండు డోసులు అందించగా, 16 కోట్ల మందికి కనీసం మొదటి డోసును అందించారు.  అయితే, ఏప్రిల్ 1 తర్వాత యూఎస్ లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.  దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం తాయిలాలు ప్రకటిస్తున్నారు.  

ప్రభుత్వంతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.  కొన్ని చోట్ల  వ్యాక్సిన్ తీసుకుంటే బీర్ ఫ్రీ అని ప్రకటిస్తుంటే, మరికొన్ని సంస్థలు వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు 100 నుంచి 200 డాలర్లు బోసన్ గా అందిస్తున్నాయి.   ఇక న్యూయార్క్ ప్రభుత్వమైతే  గవర్నర్ తో కలిసి భోజనం చేసే ఆఫర్ ను ప్రకటించింది.   దీనికోసం ఏకంగా ఓ పోర్టల్ ను తీసుకొచ్చింది.  18 ఏళ్ళు పైబడి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు అందులో పేరు నమోదు చేసుకోవచ్చు.  పేరు నమోదు చేసుకున్న వారిలో నుంచి కొందరిని సెలక్ట్ చేసి గవర్నర్ దంపతులతో విందు చేసే అవకాశం కల్పిస్తారు

Flash...   No need for RT-PCR tests if...': ICMR issues new testing guidelines for Covid-19