White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం.

NEW DELHI: As the country continues to deal with the Black Fungus cases during the second wave of COVID-19, several cases of White Fungus have also come to the fore.

కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.

మ్యూకోర్ మైకోసిస్ అనేది మానవ శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. దీనిని బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అని పిలుస్తున్నాం. ఇది కరోనా సోకిన వారి మెదడు, ఊపిరితిత్తులు, చర్మం, ముఖంపై దాడి చేస్తుంది. కొందరు బాధితులు కంటి చూపు సైతం కోల్పోయారు. ఈ క్రమంలో వైద్యశాఖకు మరో సవాల్ ఎదురైంది. బిహార్‌ రాజధాని పాట్నాలో 4 వైట్ ఫంగస్ కేసుల్ని వైద్యులు గుర్తించారు. అయితే కోవిడ్19 బారి నుంచి కోలుకున్న వారిలోనే వైట్ ఫంగస్ కేసులు రావడం ఆందోళన పెంచుతోంది. బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కన్నా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఊపిరితిత్తులు, గోళ్లు, చర్మం, ఉదరం, మూత్రపిండాలు, మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలు, నోరు లాంటి భాగాలపై వైట్ ఫంగస్ దాడి చేస్తుంది. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరికి టెస్టులు చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్19 వైరస్ సోకకున్నా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ నమోదయ్యాయని పీఎంసీహెచ్ మైక్రోబయాలీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ఎన్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. యాంటీ ఫంగల్ మెడిసిన్ వాడకం ద్వారా ఆ నలుగురు కోలుకున్నారని, వారికి ప్రస్తుతం నెగెటివ్ అని తేలినట్లు తెలిపారు. హెచ్ఆర్‌సీటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావాన్ని గుర్తించడం సాధ్యపడుతుందన్నారు. 

Flash...   Declaration of Sankranthi (PONGAL) Holidays in AP