ఏపీలో కొత్త స్ట్రెయిన్ : అంత తప్పుడు ప్రచారమే

ఏపీలో స్ట్రెయిన్ పేరుతో జరుగుతున్న ప్రచారం అంత అబద్ధమని కోవిడ్ చికిత్స టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్ర శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.  ఎన్ హెచ్ 44 అనే స్ట్రెయిన్ కోవిడ్ మొదటి దశలోనే ఉందని..ఎన్ హెచ్ 440కె అస్తిత్వం జనవరి తర్వాత దాదాపుగా తగ్గి పోయిందన్నారు. ఇప్పుడు B1617, B1178 అనేది ఇప్పుడు విస్తృతంగా ప్రబలి ఉందని వెల్లడించారు. 

వీటినే ఇండియన్ స్ట్రెయిన్ అంటున్నారని..  సీసీఎమ్.బి. నివేదికలో ఏపీ స్ట్రెయిన్ అన్న ప్రస్తావనే లేదన్నారు. కొంత మంది రెమిడెసివిర్ ను విచ్చలవిడిగా వాడుతున్నారని..పాజిటివ్ వచ్చిన మొదటి 7 రోజుల్లో వాడితేనే రెమిడెసివిర్ పని చేస్తుందని పేర్కొన్నారు.  హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి యాంటి బయాటిక్స్ వాడమని సూచించటం లేదన్నారు

Flash...   STUDENT ATTENDANCE CAPTURED PROCESS IN CSE