కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి

 


సీఎం జగన్ కు ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ లేఖ

లాక్ డౌన్ లోనూ ఉద్యోగులు పనిచేశారన్న జేఏసీ

కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయించాలని విజ్ఞప్తి

కొవిడ్ సోకిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

కరోనా పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని వినతి

సీఎం జగన్ కు ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ లేఖ రాసింది. లాక్ డౌన్ వేళ కూడా ఉద్యోగులు పనిచేశారని లేఖలో వెల్లడించారు. కొవిడ్ తో పోరాటంలో చాలామంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గెజిటెడ్ అధికారుల జేఏసీ పలు డిమాండ్లను సీఎం ముందుంచింది. 

కరోనా సోకిన ఉద్యోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరింది. కొవిడ్ తో బాధపడుతున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగులకు తక్షణమే పరిహారం చెల్లించాలని జేఏసీ తన లేఖలో పేర్కొంది.

Flash...   Tentative Decisions taken on Toilet maintenance fund (TMF):