టెన్త్ పరీక్షలు వాయిదా!

విజయవాడ, మే 25: ప్రభాతవారప్రతినిధి: పదో తర గతి పరీక్షలు వాయిదా వేసే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ప్రక టించిన షెడ్యూల్ను అనుసరించి పరీక్షలు జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపధ్యంలో “ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న తరుణంలో పరిస్థితుల టెస్ట్ పరీక్షలు నెల రోజుల పాటు వా యిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రక టించనున్నారు.

 టెన్త్ పరీక్షలు నిర్వహణపై దాగుడు మూతల్లో ప్రభుత్వం

ఎఫ్ఎ మార్కులను అప్లోడ్ చేయాలని ఆదేశాలు

 రోజుకో రకమైన ఆదేశాలు జారీ చేస్తున్న ప్రభుత్వం

గుంటూరు (తూర్పు), మే 25 కరోనా మహమ్మారి ముంచే స్తోంది. పిల్లలపైనా వైరస్ ప్రభావం కనిపి స్తోంది. పెద్దల పరి స్థితి అయితే చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పదో తర గతి పరీక్షలు జరుగుతాయా లేక రద్దు చేస్తారా అనే విషయం లో ప్రభుత్వం నుంచి స్పష్టత లేక పోవడంతో విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ అయోమయం నెలకొంటోంది పరిస్థితులు చక్కబడతాయి. కరోనా ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాలకులు చెప్తున్నారు. ఇదే క్రమంలో పది విద్యార్థుల కు ఇప్పటి వరకు పాఠశాలలో నిర్వహించిన పరీక్షల మార్పు లను అప్లోడ్ (పార్మెటివ్ ఆసస్మెంట్) చేయాలని ప్రధానో పాధ్యాయులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. “ఈ భిన్న వైఖనిల నేపథ్యంలో పది పరీక్షలపై ప్రభుత్వం. దాగుడుమూతలు ఆడుతుందని ఉపాధ్యాయులు, విద్యార్థులు | ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రోజుకో రకమైన ఆదే ||శాలు జారీ చేస్తుండటంతో ప్రతి ఒక్కరిలోనూ పరీక్షల నిర్వహ పై ఆయోమయం నెలకొంది పరీక్షలు నిర్వహించే ఉద్దేశం. ఉన్నప్పుడు విదారుల పాత మార్కులను ఎందుకు అప్లోడ్ చేయమంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Flash...   Agnipath scheme - Agniveer: 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి ?