ప‌దేప‌దే సిటీ స్కాన్ వ‌ద్దు.. ఎయిమ్స్ హెచ్చ‌రిక‌

 

క‌రోనా సోకిందేమో అనే అనుమానంతో ప‌దేప‌దే సిటీ స్కాన్ చేయిస్తున్నారా? అది చాలా ముప్పు అంటున్నారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా.. మ‌ళ్లీ మ‌ళ్లీ సిటీ స్కామ్ చేయించ‌డం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అని హెచ్చ‌రించిన ఆయ‌న‌.. కొంత‌మంది ప్ర‌తీ మూడు రోజుల‌కు సిటీ స్కాన్ చేయించుకుంటున్నార‌ని.. దీంతో.. శ‌రీరం అధికంగా రేడియేష‌న్‌కు గురికావ‌డంతో క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోల‌ద‌ని హెచ్చ‌రించారు.. 

అవ‌స‌రం అయితే, డాక్ట‌ర్ల స‌ల‌హామేర‌కే సిటీ స్కామ్ చేయించుకోవాల‌న్నారు గులేరియా.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డేవారు సీటీ స్కాన్ సెంట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతున్నార‌ని వారికి ఈ ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేద‌న్నారు. ఒక సీటీ స్కాన్ మూడు వంద‌ల ఛాతీ ఎక్స్ రేల‌తో స‌మాన‌మ‌ని, ఇది అంద‌రికీ అవ‌సరం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక‌, కోవిడ్ బాధితుల్లో ఆక్సిజ‌న్ 93 శాతం కంటే త‌క్క‌వ‌కు ప‌డిపోవ‌డం, విప‌రీత‌మైన అల‌స‌ట, నీర‌సం ఉంటేనే ద‌వాఖాన‌లో చేరాల‌ని సూచించారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా

Flash...   Cancer: మనం పట్టించుకోని 10 లక్షణాలు... వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి