మోదీ.. దిగిపొండి.. అరుంధతి రాయ్‌

కనీసం తాత్కాలికంగానైనా తప్పుకోండి

లక్షలమంది అనవసరంగా చనిపోతాం

ఈ సంక్షోభ పరిష్కారం మీ చేతుల్లో లేదు

తక్షణం మాకో సర్కారు కావాలి: అరుంధతి రాయ్‌.

Arundhati Roy: We need a government

An appeal to Prime Minister Narendra Modi: Please step aside.

న్యూఢిల్లీ, మే 4: ‘‘మోదీ.. మాకు ఊపిరాడటం లేదు. ప్రాణాలు కొడిగట్టిపోతున్నాయి. సహాయం అవసరమైన సమయంలో వ్యవస్థలేమీ పనిచేయడం లేదు. దయచేసి ఇక దిగిపోండి. కనీసం తాత్కాలికంగానైనా’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ డిమాండ్‌ చేశారు. అత్యవసరంగా పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. 

ఈ మేరకు ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌లో ఆమె తన విజ్ఞప్తిని లేఖ రూపంలో రాశారు. దేశంలో ఇప్పుడు ప్రభుత్వమన్నదే లేదని, కానీ, తమకు అత్యవసరంగా ఒక ప్రభుత్వం కావాలని స్పష్టం చేశారు. ‘‘2024 వరకూ మేం వేచి ఉండలేం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతుంటే.. నేను నా ఆత్మగౌరవాన్ని దిగమింగి, కోట్లాది మంది సహచర పౌరులతో గొంతు కలిపి అడుగుతున్నాను. అయ్యా.. దయచేసి ఇక దిగిపోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదు. ఇంత భయానకమైన ఉత్పాతం నెలకొన్న సమయంలోనూ ఎదుటివారి నుంచి ప్రశ్నను స్వీకరించలేని ప్రధాని ఉన్నప్పుడు వైరస్‌ మరింతగా పెరుగుతుంది. 

మీరు ఇప్పుడు దిగకపోతే.. మాలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతాం. అందువల్ల దిగిపోండి. మీ స్థానాన్ని తీసుకోవడానికి మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు. మీరనుకుంటున్నారు కానీ.. ప్రజాస్వామ్య ముక్త భారత్‌ అనేది ఉండదు. అలా ఉంటే దాన్ని నిరంకుశత్వం అంటారు. ప్రస్తుత వైర్‌సకు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టం. మీ అసమర్థత, ఇతర దేశాలు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఒక సాధికార కారణమవుతుంది. మనం కష్టించి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుంది. కనుక దిగిపోండి. మీరు చేయగల అత్యంత బాధ్యతాయుతమైన పని అదే. మా ప్రధానిగా ఉండేందుకు నైతిక అధికారాన్ని కోల్పోయారు’’ అని అరుంధతి రాయ్‌ ఈ పోస్టులో మండిపడ్డారు.

Flash...   Norms for re-apportionment of teaching staff - CSE Clarifications on G.O 117

source of the post https://scroll.in/article/994022/arundhati-roy-we-need-a-government