రుణ గ్రహీతలకు శుభవార్త.. మరో 3 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు?

 రుణ గ్రహీతలకు ఊరట

బ్యాంకుల కీలక నిర్ణయం

ఆర్‌బీఐకి రిక్వెస్ట్.

దేశంలో కరోనా తాండవం చేస్తోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కోవిడ్ 19 దెబ్బకి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. దీంతో వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే చాలా మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నాయి. వెలువడుతున్న పలు నివేదికలను గమనిస్తే.. ఇదే విషయం అర్థమౌతుంది. కోవిడ్ 19 కారణంగా రుణ గ్రహీతలు మళ్లీ లోన్ ఈఎంఐ చెల్లించే పరిస్థితుల్లో ఉండకపోవచ్చని బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి.

ఇదే విషయాన్ని దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కు తెలియజేశాయి. రుణ గ్రహీతలకు మారటోరియం ఫెసిలిటీని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

నివేదికల ప్రకారం.. మరో మూడు నెలలు మారటోరియం బెనిఫిట్‌ను మళ్లీ తీసుకురావాలని బ్యాంకులు ఆర్‌బీఐకి రిక్వెస్ట్ చేశాయి. లేదంటే రుణ ఎగవేతలు పెరిగే ఛాన్స్ ఉందని, దీంతో మొండి బకాయిలు పైకి చేరుతాయని బ్యాంకులు భయపడుతున్నాయి. అందుకే రిటైల్ రుణాలు తీసుకున్న వారికి, బిజినెస్ లోన్స్‌కు మారటోరియం కల్పించాలని బ్యాంకులు ఆర్‌బీఐని కోరుతున్నాయి. కాగా ఆర్‌బీఐ గత ఏడాది ఆరు నెలలు మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే.

Flash...   WhatsApp: 2022 New features and Options