నాణ్యమైన విద్యలో వెనుకబాటు.

నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే వెనుకబడింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్‌ (2020-21) నివేదికను  విడుదల చేసింది.

ఈనాడు, అమరావతి: నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే వెనుకబడింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్ (2020-21) నివేదికను విడుదల చేసింది. మొత్తం 17 లక్ష్యాలు- సాధించిన పురోగతి ఆధారంగా నివేదికను రూపొందించగా ఇందులో అందరికీ నాణ్యమైన విద్యను అందించడం నాలుగో లక్ష్యంగా నిర్దేశించారు. నాణ్యమైన విద్యకు 11 అంశాల ప్రామాణికంగా స్కోరును కేటాయించారు. ఏపీకి 50 పాయింట్లు వచ్చాయి. గత 2019-2020 నివేదికలో 52 పాయింట్లతో 18వ స్థానంలో నిలవగా.. ఈసారి 19కి పడిపోయింది. నాణ్యమైన విద్యలో 100 పాయింట్లకు కేరళ 80 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బిహార్29 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.

అక్షరాస్యతలో 27వ స్థానం

15ఏళ్లు, ఆపైబడిన వారి అక్షరాస్యతలో 65.60 శాతంతో రాష్ట్రం 27వ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సరాసరి 74.6 కంటే తక్కువ. బిహార్ 64.7 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

సెకండరీ స్థాయిలో 9-10 తరగతుల్లో ఏడాదికి బడి మానేస్తున్నవారు రాష్ట్రంలో 16.37 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జాతీయ సరాసరి; 17.87 కంటే తక్కువగా ఉన్నా.. జాతీయ స్థాయిలో 14వస్థానంలో నిలిచింది.

;స్థూల ప్రవేశాల నిష్పత్తి 11-12 తరగతుల్లో (ఇంటర్మీడియట్) 46.84 శాతంగా ఉంది. దేశంలో 17వ స్థానంలో నిలవగా జాతీయ సరాసరి కంటే కొంచెం మెరుగ్గా ఉంది.

ఎనిమిదో తరగతి అభ్యాసనా ఫలితాల్లో 80.2 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి.</span><br సెకండరీ స్థాయి (9-10) తరగతుల విద్యార్థులకు బోధించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 75.18శాతం ఉన్నారు. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువగా ఉంది. దేశంలో ఏపీ 20వ స్థానంలో నిలిచింది.

పాఠశాలల మౌలిక సదుపాయాల్లో జాతీయ స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. 

 

Flash...   LIC Scheme: మహిళలకు అదిరిపోయే స్కీమ్.. కేవలం రూ.29 కడితే, రూ. 4 లక్షలు పొందవచ్చు..