పరీక్షలు నిర్వహణ, నాడు నేడు కార్యక్రమాలపై సమీక్షించిన గౌ౹౹ మంత్రి సురేష్


సమీక్ష ముఖ్య అంశాలు

 NEP పై  ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నుంచి సూచనలు తీసుకుని పరిశీలించాలి …

2021-22 విద్యాసంవత్సరం కాలెండర్ ను తయారు చేయాలి ..

జూలై నెలలో 10th, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలిస్తే టైం టేబుల్ తయారు చేసుకోవాలి …

అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం మొదటి విడత పనులపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు  మరోమారు సమీక్షించారు. మొదటి విడత పనులు ముగించి త్వరలో రెండో విడత పనులు ప్రారంభించాలనే ఉద్దేశ్యం తో ప్రతి వారం మంత్రి గారు  అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వశ్రీ  ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, డైరెక్టర్ పాఠశాల విద్య చిన్నవిరభద్రుడు, సమగ్రశిక్ష ఎస్పీడి వెట్రిసెల్వి, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ గార్లు  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి సురేష్ గారు  మాట్లాడుతూ….

ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశామని, గడువులోగా మొదటి విడత పనులు పూర్తి చేసి రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉంది.

నాడు నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీ ల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి. ఇప్పటికి ఇంకా ప్రారంభించనివి కాకుండా వివిధ దశల్లో ( బేస్మెంట్, వాల్ కంప్లీట్, గేట్స్, పెయింటింగ్ పెండింగ్) ఉన్నవాటిని 20వ తేదీలోగా పూర్తి చేయాలి.

14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవి కూడా పూర్తి చేయాలన్నారు.

జాతీయ నూతన విద్యావిధానం పై ఉపాధ్యాయ సంఘాలనుంచి వినిపిస్తున్న సందేహాలపై అధికారులతో సమీక్షించారు.

ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నుంచి సూచనలు తీసుకుని పరిశీలించాలని సూచించారు.

2021-22 విద్యాసంవత్సరం కాలెండర్ ను తయారు చేయాలని అధికారులకు సూచించారు.

Flash...   Long absentees list called for

ఒకవేళ జూలై నెలలో 10, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలిస్తే టైం టేబుల్ తయారు చేసుకోవాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమీక్షకోసం సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జగనన్న విద్యాకానుక సరఫరా తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

****************

శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.