AP Tenth and Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ తో పాటు అన్ని ఎగ్జామ్స్ ఆ నెలలోనే

 AP Tenth and
Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ తో పాటు అన్ని ఎగ్జామ్స్ ఆ నెలలోనే.. కసరత్తు ప్రారంభించిన
జగన్ సర్కార్.. వివరాలివే

కరోనా కేసులు
తగ్గుతుండడంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర పరీక్షల
నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని
భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షలను
ఎలాగైనా నిర్వహించాలని భావిస్తోంది.

 దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేస్తున్నా.. విద్యార్థుల భవిష్యత్ కోసం తాము అన్ని
జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తామని జగన్ సర్కార్ అనేక సార్లు స్పష్టం
చేస్తోంది. 

 విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాల నుంచి
కూడా పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గడం
లేదు.

 అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం
పట్టడంతో మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే.. 

 జూలై నాటికి కేసులు ఇంకా తగ్గుతాయని.. దీంతో ఆ నెలలో
పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

 పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా మారినా.. జులైలో
ఇంటర్ తో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

 జూన్ 20 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో
ఆ తర్వాత సమీక్ష నిర్వహించి పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు అధికారులు. 

 ఇంటర్ పరీక్షలు జులైలో పూర్తయితే ఆగస్టులో ఇంజనీరింగ్,
ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని
అధికారులు భావిస్తున్నారు. 

 ఈ పరీక్షలన్నీ అనుకున్న సమయానికి పూర్తి అయితే..
సెప్టెంబర్ లో తరగతులు ప్రారంభించవ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Flash...   Sunday Story time google link for photos upload

 టెన్త్ ఎగ్జామ్స్ కూడా జూలై లేదా ఆగస్టులోనే నిర్వహించే
అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ కూడా జూలై లేదా
ఆగస్టులోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి
.