Earnings: మీకు రూ.లక్షల్లో సంపాదించే అవకాశం కల్పిస్తున్న మోదీ సర్కార్.. ఇలా అప్లై చేసుకోండి!

అదనపు ఆదాయం పొందాలని భావిస్తున్నారా? ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకోసం మోదీ సర్కార్ ఒక అవకాశం కల్పిస్తోంది. ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.

 

జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా సాయం అందిస్తుంది. వీటిల్లో మెడిసిన్స్ 90 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తాయి. ప్రజలు ఈ షాపుల్లోకి వెళ్లి ఔషధాలను కొనుగోలు చయొచ్చు. ఔన్ ఔషధి కేంద్రాల్లో మూడు రకాలు ఉంటాయి. ఫార్మసిస్ట్, డాక్టర్లు, ఎవరైనా నేరుగా ఈ షాపులు ఓపెన్ చేయొచ్చు. అలాగే ట్రస్ట్‌లు, ఎన్‌జీఓలు, ప్రైవేట్ హాస్పిటల్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయొచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నామినేటెడ్ ఏజెన్సీ కూడా ఈ షాపులను ఓపెన్ చేసే అవకాశముంది.

జన్ ఔషధి కేంద్రం పేరు మీద రిటైల్ డ్రగ్ సేల్స్ లైసెన్స్ తీసుకోవాలి. https://janaushadhi.gov.in/ ద్వారా మీరు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫామ్ ఫిల్ చేసి బ్యూర ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ఆఫ్ ఇండియా (బీపీపీఐ) జనరల్ మేనేజర్‌కి అప్లికేషన్ పంపాలి.

జన్ ఔషధి కేంద్రాల్లో విక్రయించే ఔషధాలపై మీకు 20 శాతం మార్జిన్ ఉంటుంది. ఇంకా పత్యేక ఇన్సెటివ్స్ లభిస్తాయి. ఔన్ ఔషధి షాపు తెరవడానికి అయిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రూ.2 లక్షల వరకు మీకు రిఫండ్ చేస్తుంది. నెలకు రూ.15 వేల చొప్పున ఈ డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. అలాగే నెల వారీ అమ్మకాలపై 15 శాతం ఇన్సెటివ్ వస్తుంది. గరిష్టంగా రూ.15 వేలు పొందొచ్చు.2024 మార్చి చివరి నాటికి జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేలకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2021 జూన్ 11 నాటికి దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్య 7836గా ఉంది. అందువల్ల మీకు సంపాదించే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.

Flash...   IMPLEMENTATION OF 6 PAPERS IN SSC FINAL EXAMS IN AP

Guidelines for Opening of New Pradhan Mantri Bhartiya Janaushadhi Kendra

Procedure for reimbursement of Special Incentive Rs. 2 lakhs