LEAVES & HOLIDAYS : CLARIFICATIONS ON DIFFERENT LEAVES OF EMPLOYEES

 

A Superintendent of Mandal Parishad was asked by the M.P.D.O. in writing to
attend the office on a public holiday in view of the urgency of work. The
Superintendent attended the office on public holiday. Subsequently he has
claimed compensatory holiday in lieu of holiday which was refused by the
M.P.D.O. Is it in order? Yes/No

 

Yes, according to the instructions issued in Government Memo No.6176/52-2,
Public (Political B) dated 15-10-1952 the compensatory holidays in lieu of
holidays; are admissible only to Ministerial Staff ranking below
superintendents. Hence the act of M.P.D.O. in refusing compensatory holiday to
the superintendent is in order.

 

ఒక ఉద్యోగి ఒక నెలలో వరుసగా వచ్చిన నాలుగు రోజుల పబ్లిక్ హాలిడేస్తో పాటు మరో
8 రోజులు సాధారణ సెలవు (Casual Leave) కోసం దరఖాస్తు పెట్టుకొని 8 రోజులు
క్యాజువల్ సెలవు మంజూరు చేయించుకున్నాడు. మంజూరు వుత్తర్వులు సక్రమమా? Yes /
No

 

No. యఫ్. ఆర్. 85 ఆనెగర్ VII ఐటమ్ 1 రూలింగ్ 4 ప్రకారం, ఆదివారాలు యితర ప్రభుత్వ
సెలవుదినాలు, ఐచ్ఛిక సెలవుదినాలు కలిసి మొత్తం 10 రోజులకు మించరాదు. అందువలన
మంజూరు వుత్తర్వులు సక్రమము కాదు.

 

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టరు, ఉద్యోగాన్వేషణ నిమిత్తం అమెరికా
వెళ్ళాలని అందువలన 4 సంవత్సరములు Extra Ordinary Leave సెలవుపై వెళ్ళటకు
అనుమతించవలసినదిగా దరఖాస్తు పెట్టుకున్నాడు. అట్టి దరఖాస్తును నియమ నిబంధనలకు
విరుద్ధమని పై అధికారులు తిరస్కరించారు. ఇది సక్రమమైన చర్య అవునా కాదా?

Yes, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలలో ఉద్యోగం చేయుటకు ఐదు సంవత్సరముల వరకు
పూర్వానుమతితో Extra Ordinary Leave పై వెళ్ళుటకు అవకాశం కలదు. కాని విదేశాల
ప్రభుత్వం నుంచి కాని, ఇతర సంస్థల నుంచి గాని ఉద్యోగం యిచ్చినటువంటి దాఖలా
వుండాలి. కేవలం ఉద్యోగం సంపాదించుకొను నిమిత్తం సెలవు మంజూరు చేయకూడదు.
అధికారులు డాక్టరు గారి అభ్యర్ధన తిరస్కరించటం నియమ నిబంధనలకు అనుగుణంగా
వుంది. 

(U.O. Note No. 13127/A/113, F.R.-1, F&P (F.W.F.R.I) Dept., dated
13-5-1998).

 

ఒక జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ 1-5-2000 నుంచి 31-12-2000 వరకు అనారోగ్య
కారణాల వల్ల మెడికల్ సర్టిఫికేట్పై అసాధారణ సెలవు పై వెళ్ళాడు. తాను అనారోగ్య
కారణాలపై వెళ్ళటం జరిగింది. కాబట్టి, అట్టి సెలవును తదుపరి ఇంక్రిమెంటు
తీసుకొనుటకు పరిగణనలోకి తీసుకొనవలసినదిగా శాఖాధిపతిని అభ్యర్ధించాడు.
తదనుగుణంగా శాఖాధిపతి కార్యాలయము నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాఖాధిపతి
ఉత్తర్వులు సక్రమం అవునా కాదా? Yes/No

 

No, అసాధారణ సెలవులను ఏవిధంగా పరిగణించవలసియున్నది అను విషయం. అందుకు అధికారం గల
అధికారుల వివరములు F.R. 26(b)(ii), F.R. 66 మరియు Government Circular Memo No.
21102-B/371/A2/ FR_1/98F&P (F.W.FR.I) Dept., dated 7-8-1998 నందు
విశదీకరించారు. వాటి ప్రకారం E.O.L. on Medical Certificate కాలమును ఇంక్రిమెంటు
యిచ్చుటకు పరిగణనలోనికి తీసుకొనుటకు శాఖాధిపతికి 6 నెలల కాలపరిమితికి మాత్రమే
కుదించబడియున్నది. అంతకు మించిన కాలమునకు ప్రభుత్వమునకు మాత్రమే. అధికారం కలదు.
ప్రస్తుత విషయంలో E.OL కాలం 6 నెలలకు మించియున్నందున, శాఖాధిపతి కార్యాలయ
ఉత్తర్వులు సక్రమము కావు.

 

ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయుచున్న సీనియర్ అసిస్టెంటు ఇంటి నుండి
కార్యాలయమునకు వెళుతూ ఆటో ఢీకొట్టడం వలన తీవ్రగాయాలకు గురియై 6-1-2001 నుండి
10-4-2001 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ చికిత్స కాలానికి F.R.83A క్రింద
తనకు Special Disability Leave మంజూరు చేయవలసినదిగా దరఖాస్తు పెట్టుకున్నాడు.
దరఖాస్తు పరిశీలించి Special Disability Leave మంజూరు చేయటం జరిగింది. బిల్లు
ట్రెజరికి పంపినప్పుడు, Special Disability Leave మంజూరు సక్రమం కాదని ఆక్షేపణ
తెలిపారు. ఆక్షేపణ సక్రమం అవునా కాదా? Yes/No

 

Yes. ప్రభుత్వ ఉత్తర్వులు GO.Ms.No. 133, F&P, Dept., dated 10.6.1981 మేరకు ఒక
ఉద్యోగి కార్యాలయపు పని నిమిత్తం ప్రయాణించే సందర్భంలో రోడ్డు యాక్సిడెంటు
గురియైతే Special Disability Leaveకు అర్హత కలిగి వుంటాడు. అంతేగాని ఇంటి నుంచి
కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి వెళుతూ ప్రమాదానికి గురియైతే Special
Disability Leaveకు అర్హుడు కాదు. ప్రస్తుత కేసు విషయంలో ఉద్యోగి యింటి నుంచి
కార్యాలయం వెళుతూ ఆటోవాడు ఢీకొట్టడం వల్ల ప్రమాదానికి గురియైనాడు. కాబట్టి పై
సెలవుకు అర్హుడు కాదు. ట్రెజరి వారి ఆక్షేపణ సక్రమంగా వుంది.

 

ఒక పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేయుచున్న మహిళా ఉద్యోగి తన కుమారుడు Chicken
Pox (ఆటలమ్మ)కు గురియైనందున అతనిని చూసుకొనుటకు తనకు Special Casual Leave, 21
రోజులు మంజూరు చేయవలసినదిగా మునిసిపల్ హెల్త్ ఆఫీసరు జారీచేసిన మెడికల్
సర్టిఫికేటు జతపరుస్తూ 15-5-2001న దరఖాస్తు చేసుకొన్నది. పురపాలక సంఘ హెల్త్
ఆఫీసర్ జారీచేసిన మెడికల్ సర్టిఫికేట్ మరియు రిమార్క్సు ఆధారంగా ఆమెకు Special
Casual Leave మంజూరు చేయటం జరిగింది. అట్టి మంజూరు ఉత్తర్వులు సక్రమం అవునా
కాదా? Yes/No

 

No. 21-1-1992 తేదీ నాటికి ముందు ఎవరైనా ఉద్యోగి కుటుంబంలోని వారు Chicken Poxకు
గురియైన సందర్భంలో Special Casual Leave పొందు | అవకాశం ఉండేది. కాని అలాంటి
సదుపాయాన్ని ప్రభుత్వం G.O.Ms.No. 10, F&P, (FW.F.R.I) dated 24-1-1992
ద్వారా రద్దు పరిచింది. అందువలన 15-5-2001 నాడు సమర్పించిన దరఖాస్తు ఆధారంగా ఈ
విషయంలో Special Casual Leave మంజూరు చేయటం సక్రమం కాదు.

 

ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ (Secretariat) లో 45 సంవత్సరాలు వయసు పైబడి రూ.
10950-250-17575 స్కేలులో పనిచేస్తున్న ఒక ఉన్నత అధికారి, ధ్యానం (Meditation),
దాని ప్రయోజనాలపై నమ్మకం పెంచుకొని హైదరాబాద్ విపాసన అంతర్జాతీయ మెడిటేషన్
కేంద్రం వారు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరగునిమిత్తం ప్రత్యేక సాధారణ
సెలవు (Special Casual Leave) కావాలని పై అధికారికి విన్నవించుకోగా పై అధికారి
అట్టి Special Casual Leave మంజూరు చేశాడు. Special Casual Leave ఈ విషయంలో
మంజూరు చేయటం సక్రమం అవునా కాదా? Yes/No? 

 

Yes, హైదరాబాద్లోని Vipasana International Meditation Centre (Located at 12.6
KM Nagarjuna Sagar Road, Kusuma Nagar, Vanasthalipuram, Hyderabad, Pin. 500
070) లో ధ్యాన శిక్షణ పొందగోరు ప్రభుత్వ ఉద్యోగులకు (Deputy Secretary to
Government and above in the Scale of 10950-350-17575 (RPS 1998) and above 45
years) Special Casual Leave teacherinfo .in మంజూరు చేయుటకు ప్రభుత్వం అనుమతించింది. (vide
G.O.Ms.No.317 G.A. (A.R. & T.III) Dept. dated 8-9-2000 as amended in
G.O.Ms.No. 351, G.A. (A.R.&T) Dept., dated 18-10-2000. అందువలన Special
Casual మంజూరు చేయటం సక్రమంగా వుంది.

Flash...   2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి అతిగా పొగత్రాగుటకు అలవాటు పడి కాన్సర్ వ్యాధికి గురి
అయ్యాడు. చికిత్స చేయించుకొను తలంపుతో, Earned Leave ఖాతాలో లేనందున, Half Pay
Leave 30 రోజులు తన Half Pay Leave ఖాతా నుంచి మంజూరు చేసి 30 రోజులన్నింటికి
పూర్తి జీతము ఇవ్వమని అర్టీ పెట్టుకున్నాడు. అలా చేయుటకు వీలులేదని Half Pay
Leave 60 రోజులు 30 రోజులుగా Commute చేస్తే పూర్తి జీతం ఇస్తామని అతని
విజ్ఞప్తిని కార్యాలయం వారు తిరస్కరించారు. అట్టి చర్య సక్రమం అవునా కాదా?
Yes/No

 

No, ఆంధ్రప్రదేశ్ Leave Rules 1993 (Rule 28 proviso) మరియు G.O.Ms.No. 268,
F&P Dept., dated 29-10-1991) ప్రకారం, క్షయ, కుష్టు, కాన్సర్, మతిస్థిమితం
లేకపోవుట, హృద్రోగం మరియు Renal Failure వ్యాధులకు గురియైన ఉద్యోగులు Half Pay
Leaveలో వుంటే కూడా 6 నెలల వరకు పూర్తి జీతం పొందుటకు అర్హులు. అందువలన ఉద్యోగి
విజ్ఞప్తిని కార్యాలయం వారు తిరస్కరించటం సరికాదు. G.O.Ms.No. 234, Finance and
Planning (Fin FRI) department dated 27-05-1994 ద్వారా జారీ చేసిన మార్పుల
ప్రకారం, రివైజ్డ్ పే స్కేల్పు 1993 ప్రకారం, దు. 2375/- మించకుండా పే డ్రా
చేయుచున్న ఎన్టీఓ అందులో సగం, నెలకు రూ. 780/- తగ్గకుండా, అలాగే నెలకు 1185/-
మించకుండ, అసాధారణ (EOL) సెలవులో వెళ్ళిన క్షయ, కుష్టు, కాన్సరు, మానసిక జార్యం,
హృద్రోగం, కిడ్ని చెడిన (Failure) ఉద్యోగి పొందు అవకాశం కల్పించారు (Note 3 (R)
(ii)], అదే విధంగా కడపటి శ్రేణి (Last grade service) ఉద్యోగి అలాంటి
పరిస్థితులలో రూ.1050/- మించకుండా నెలకు పారితోషికంగా (Exgratia) పొందవచ్చు.

తదుపరి 2010 పి.ఆర్.సి ఆధారంగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు GOP Ms. No.
155 Finance (FR I) Department, dated 04-05-2010 ప్రకారం; క్షయ, కుష్టు,
క్యాన్సరు, మానసిక వ్యాధి, గుండెకు సంబంధించిన వ్యాధులు (Heart diseases))
మరియు కిడ్నీ పని చేయకపోవటం (Failure) కారణాలవల్ల అసాధారణ సెలవుపై వెళ్ళిన
ఎన్జిఓలు; కడపటి శ్రేణి (Last grade service) ఉద్యోగులు క్రింద తెలియజేసిన
విధంగా పారితోషికం పొందు అవకాశము కలదు.

 

కలెక్టరు కార్యాలయం కంప్యూటర్ విభాగంలో పనిచేయుచున్న ఒక ఉద్యోగి
అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగ ఉత్తర్వులు వచ్చాయని, అలాంటి
ఉత్తర్వుల నకలు జతపరుస్తూ, ఆ ఉద్యోగంలో చేరుటకు నాలుగు సంవత్సరములు E.O.L.
మంజూరు చేస్తూ కొత్త ఉద్యోగంలో చేరుటకు అనుమతించవలసినదిగా ఆర్జీపెట్టుకున్నాడు.
అలా అనుమతించటానికి చట్టం అనుమతించదని అవసరమని తోస్తే తమ పదవికి రాజీనామా ఇచ్చి
వెళ్ళిపోవచ్చని అధికారులు అతని ఆర్జీ త్రిప్పి పంపారు. అధికారులు చర్య సక్రమం
అవునా కాదా? Yes/No

 

 No, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధ్యంలో పనిచేయుచున్న ఏ ఉద్యోగియైనా
విదేశాలలో పనిచేయుటకు ఆ దేశం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చియున్న యెడల ఆ
ఉద్యోగి నుంచి ప్రభుత్వానికి ఎలాంటి బాకీలు లేకున్న, కోర్టు కేసులలో
Prosecutions Pending లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వానుమతి పొంది ఐదు
సంవత్సరముల వరకు E.O.L. పై వెళ్ళుటకు G.O.Ms.No. 214, F&P Dept., dated
3-9-1996 as clarified in Government U.O.Note No. 13127-A/113/F.R.1198
F&P (F.W.E.R.I.) Dept., dated 13-5-1998 ద్వారా అవకాశం కల్పించారు. ఈ
సందర్భంగా ఆ ఉద్యోగిని తన పదవికి రాజీనామా చేసి వెళ్ళమని అధికారులు అతని
ఆర్జీని తిరస్కరించటం సక్రమం కాదు.

ఒక రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి గుండెజబ్బు (Heart Disease) తో బాధపడుతూ
చికిత్స నిమిత్తం సెలవు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అతని Leave Accountలో
(ఆర్జిత సెలవు) లేనందున అర్ధ జీతం (Half pay leave) సెలవు వున్నందున మూడు నెలల
Half pay leave కోసం దరఖాస్తు చేస్తూ, అట్టి సెలవు రోజులకు పూర్తి జీతం
ఇవ్వవలసినదిగా కోరినాడు. Half pay leave కు పూర్తి జీతం రాదని, అట్టి సెలవును
Commute చేస్తేనే పూర్తి జీతం వస్తుందని అతని దరఖాస్తును అధికారులు తిప్పి
పంపారు. అధికారుల చర్య సక్రమం అవునా కాదా? Yes/No

 

No, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు గుండెజబ్బులకు గురియైన సందర్భాలలో
చికిత్స నిమిత్తం వారికి Half Pay Leave Account ఖాతాలో ఉన్న యెదల 6 నెలల వరకు
Half pay leaveకు పూర్తి జీతం పొందుటకు అర్హులు. (GO.Ms.No. 20, Fin., dated
25-1-1977) and G.O.Ms.No. 268 F&P Dept., dated 29.10.1991 అందువలన
అధికారుల చర్య సక్రమం కాదు.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయానికి బయలుదేరి బస్సు ఢీకొని ప్రమాదానికి
గురియై ఆసుపత్రిలో చికిత్స పొంది, తిరిగి డ్యూటీలో చేరుతూ, Medical
Certificate, (Physical Fitness Certificate) పొందుపరుస్తూ, 20 రోజులకు Earned
Leave మంజూరు చేయవలసినదిగా దరఖాస్తు పెట్టుకున్నాడు. Medical Certificate సెలవు
కాలం అయిపోయిన తర్వాత హాజరు పరచటం అనుచితమని అందువలన Earned Leave మంజూరు చేయటం
వీలుకాదని అతని అభ్యర్ధనను తిరస్కరించారు. ఆవిధంగా తిరస్కరించటం సక్రమం అవునా
కాదా? Yes/No

 

No, Government Circular Memo No. 21102-B/371/A2/FRI1/98, F&P (FWFRI) Dept., dt. 7-8-1998 ప్రకారం ఏ ఉద్యోగియైన
ప్రమాదానికి గురియైగాని, తీవ్ర అనారోగ్యానికి గాని గురియై ఆసుపత్రిలో చేరి,
చికిత్సానంతరం మెడికల్ సర్టిఫికేటుతో పాటు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు
జతచేసిన సందర్భాలలో సెలవు మంజూరు చేయవచ్చు. అందువలన అధికారుల చర్య
సక్రమం.

 

ఒక వివాహిత ప్రభుత్వ ఉద్యోగిని, తన రెండవ కాన్పుకై ప్రభుత్వ
ఆసుపత్రిలో చేరింది. కాని దురదృష్టవశాత్తు గర్భస్రావం జరిగింది. ఆ విషయం
సంబంధిత అధికారులకు తెలియజేస్తూ, ఆ విషయమై మెడికల్ సర్టిఫికేటు జతపరుస్తూ
తనకు ప్రసూతి సెలవు మంజూరు చేయవలసినదిగా అభ్యర్థించింది. ప్రసూతి సెలవు అనేది
ప్రసవించిన సందర్భంలోనే ఇస్తారని, గర్భస్రావ విషయంలో ఇవ్వరని అధికారులు ఆమె
అభ్యర్ధనను తిరస్కరించారు. అధికారులు చర్య సక్రమం అవునా? కాదా? Yes/No

 

No. ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No. 113, F&P Dept., dated
15.3.1961 ప్రకారం గర్భస్రావం (Miscarriage) జరిగిన సందర్భాలలో, మెడికల్
సర్టిఫికేటు ఆధారంగా వివాహిత ఉద్యోగినికి ఆరువారములు మించకుండ ప్రసూతి సెలవు
మంజూరు చేయవచ్చును. అందువలన అధికారుల చర్య సక్రమం కాదు.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి Optional Holiday avail చేసుకోవటానికి దరఖాస్తు
చేసుకున్నాడు. కార్యాలయంలో పని ఎక్కువ వున్నదని అధికారి ఆ దరఖాస్తును
తిరస్కరిస్తూ కార్యాలయమునకు హాజరు కావలసినదిగా ఉద్యోగిని ఆదేశిస్తూ ఉత్తర్వులు
జారీచేశారు. ఉద్యోగి Optional Holiday రోజున కార్యాలయమునకు హాజరై తదుపరి
Working day రోజుకు Compensatory Holiday మంజూరు చేయవలసినదిగా దరఖాస్తు
చేసుకున్నాడు. అధికారి Compensatory Holiday మంజూరు చేశాడు. అధికారి చర్య
సక్రమం అవునా? కాదా? Yes/No

Flash...   LIP 100 days programme - words for the period from 16.03.2022 to 31.03.2022

 

Yes, ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No. 528, G.A. (Pol.B) Dept., dated
26-4-1961 ప్రకారం అధికారి చర్య సక్రమంగా వుంది. పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం
అలాంటి సెలవు Calendar Yearలో మూడు రోజులకు మించకూడదు.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగిణి 180 రోజులు ప్రసూతి సెలవు అనంతరం, మెడికల్
సర్టిఫికేట్ జతపరుస్తూ మరో 15 రోజులు అదనంగా సెలవు Commuted leave కావాలని
దరఖాస్తు చేసుకుంది. ప్రసూతి సెలవుతో పాటు ఇతర సెలవులు మంజూరు చేయుటకు నియ
నిబంధనలు అనుమతించవని M.P.D.O. ఆమె దరఖాస్తును తిరస్కరించారు. M.P.D.O. చర్య
సక్రమం. అవునా? కాదా ? Yes/No

 

No Fundamental Rules 101 (2) ప్రకారం ప్రసూతి సెలవుకు Continuationగా ఏ
ఇతర సెలవులైనా తీసుకొనుటకు అవకాశం వుంది. కాని అట్టి సెలవు మెడికల్ సర్టిఫికేట్
ఆధారంగా మాత్రమే అనుమతించవలసియున్నది. ప్రస్తుత 
విషయంలో ఉద్యోగిణి మెడికల్ సర్టిఫికేటు ఆధారంగా Communication of leave కోసం
దరఖాస్తును సమర్పించియున్నందున M.P.D.O., సెలవు మంజూరు చేయుటకు చర్య
తీసుకొనవలసింది. దరఖాస్తును తిరస్కరించటం సక్రమం కాదు.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో అకృత్యాలకు పాల్పడి సర్వీసు నుంచి
డిస్మిస్ అయ్యాడు. దరిమిలా అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, తాను చేసుకున్న
అప్పీలుపై నెగ్గి సర్వీసులో తిరిగి నియమించబడినాడు. (Reinstated) తాను
సర్వీసులో తిరిగి నియమించబడినందున, అంతకు ముందు తనకు సర్వీసును లెక్కించి లీవు
అకౌంటుకు జమ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అతను ఒకసారి సర్వీసు నుంచి
డిస్మిస్ అయినందున గత సర్వీసుకు సంబంధించిన అన్ని Leave Account
పోగొట్టుకున్నట్లు భావించవలసి వస్తుందని, అతను సర్వీసులో తిరిగి నియమించిన తేదీ
నుంచి అట్టి సర్వీసు మాత్రమే Leave Accountకు పరిగణించవలసి వుంటుందని అతని
దరఖాస్తును తిరస్కరించారు. అధికారుల చర్య సక్రమం అవునా? కాదా ? Yes/No

 

No. ఫండమెంటల్ రూల్సు 65 (బి) ప్రకారం, డిస్మిస్ అయిన ఉద్యోగి..
అప్పీలుపై మరల నియమించబడిన పక్షంలో అతని పూర్వ సర్వీసును
పరిగణనలోకి  
తీసుకొనవలసి వుంటుంది. అందువలన అధికారుల చర్య సక్రమం కాదు.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి 15-1-2003 నుంచి 10 రోజుల పాటు ఆర్జిత (Earned Leave) సెలవు పై వెళ్ళుటకు దరఖాస్తు చేస్తూ 13-1-2003 మరియు |
14-1-2003 పబ్లిక్ హాలిడేస్ అయినందున వాటిని Prefix చేసుకొనుటకు
అనుమతించవలసినదిగా కోరాడు. అతనికి ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ, 13-1-2003 మరియు
14-1-2003 కూడ ఆర్జిత సెలవు క్రింద పరిగణించి అతని ఆర్జిత సెలవు పద్దు క్రింద
ఖర్చు (Debit) చేశారు. అధికారులు చర్య సక్రమం అవునా? కాదా? Yes/No

 

No. ఆర్జిత సెలవుకు ఉద్యోగి పబ్లిక్ హాలిడేస్ ముందుగా Prefix
చేసుకున్నప్పుడు గాని సెలవు తర్వాత వచ్చు పబ్లిక్ హాలిడేస్ Suffix
చేసుకున్నప్పుడుగాని, అట్టి పబ్లిక్ హాలిడేస్ లీవ్ అకౌంటుకు Debit చేయకూడదు.
(Sub Rule 3 of FR 68) అందువలన అధికారులు చర్య సక్రమం కాదు.

 

స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక జిల్లా కలెక్టరు స్థానికులకు
ఒకరోజు సెలవు గెజిట్లో ప్రకటించారు. ఒక ఉద్యోగి ఆర్జిత సెలవుపై వెళ్ళుచూ
కలెక్టరుగారు’ ప్రకటించిన Local Holiday ను తన ఆర్జిత సెలవుకు Prefix
చేయవలసినదిగా కోరాడు. అధికారులు అతని అభ్యర్థనను మన్నించి Local Holiday ను
Prefix చేసుకొనుటకు అనుమతించారు. అధికారులు చర్య సక్రమం అవునా? కాదా ?
Yes/No

 

No. ఫండమెంటల్ రూలు 68లోని సబ్రూలు 5 ప్రకారం Local Holidayను సెలవుపై
వెళ్లు ఉద్యోగి Prefix గాని, Suffix గాని చేసుకొను అవకాశం లేదు. అందువలన Local
Holiday ను Prefix చేసుకొనుటకు అనుమతించిన అధికారుల చర్య సక్రమం కాదు. Local
Holiday ప్రకటించిన రోజు ఉద్యోగి ఈ సందర్భంగా ఆర్జిత సెలవులో వున్నట్లు
పరిగణించవలసి యున్నది.

 

ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలోని వాతావరణానికి విసుగు చెంది రెండు
నెలల ఆర్జిత సెలవు కోసం దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకొని సెలవుపై
వెళ్ళాడు. ఒక నెల తర్వాత మనసు మార్చుకొని, మిగిలిన సెలవు కాలాన్ని Cancel
చేయమని సంబంధిత అధికారిని అభ్యర్థిస్తూ డ్యూటికి హాజరయ్యాడు. మంజూరు చేసిన
రెండు నెలల సెలవు పూర్తి అయిన తర్వాతనే డ్యూటీలో చేర్చుకుంటానని అంతవరకు
చేర్చుకోనని సెలవు మంజూరు చేసిన అధికారి ఉద్యోగి అభ్యర్ధనను తిరస్కరించాడు.
అధికారి చర్య సక్రమం అవునా? కాదా? Yes/No

 

Yes, ఫండమెంటల్ రూలు 72 ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగి సెలవు పూర్తిగాక ముందే డ్యూటీలో తిరిగి చేరుటకు సెలవు మంజూరు చేయు అధికారి అనుమతి
పొందవలసియున్నది. అట్టి అధికారి అనుమతి లేనిదే ఉద్యోగి సెలవు కాలాన్ని
స్వచ్ఛందంగా Cancel చేసుకొని తిరిగి డ్యూటిలో చేరు అవకాశం లేదు. అందువలన ఈ
విషయంలో అధికారి చర్య సక్రమంగా వుంది.

 

ఒక ప్రభుత్వ వివాహిత ఉద్యోగిణి మొదటి కాన్పులో కవలలను ప్రసవించింది.
ఇద్దరు పిల్లలు సజీవులై ఉండగానే మరల రెండవసారి గర్భవతియై డాక్టరు సలహామేరకు
అబార్షన్ చేయించుకుంది. ఆ సందర్భంగా తనకు 21 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవు
మంజూరు చేయవలసినదిగా అధికారులను అభ్యర్థించింది. రెండవ కాన్పు సందర్భంగా
అబార్షన్ చేయించుకుంది. కాబట్టి స్పెషల్ క్యాజువల్ లీవు 
21 రోజులు మంజూరు చేయవచ్చునని కార్యాలయపు సంబంధిత గుమాస్తా నోటు సమర్పించాడు.
గుమాస్తా సమర్పించిన నోటు సక్రమం అవునా? కాదా ? Yes/No

 

No, ప్రసూతి సందర్భంలో ఇద్దరు కన్న తక్కువ పిల్లలు గల వివాహిత
ఉద్యోగినులకు మాత్రమే 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయు అవకాశం
గలదు. ప్రస్తుత ఉద్యోగిణికి ఇద్దరు సజీవులైన పిల్లలు ఉన్నందున, తదుపరి
రెండవసారి మాత్రమే గర్భవతి అయినప్పటికి 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవుకు ఆమె
అర్హురాలు కాదు. (Executive Instructions 7 of Annexure 7 F.R.) అందువలన
కార్యాలయపు గుమాస్తా సమర్పించిన నోటు సక్రమంగా లేదు.

సెలవుల గురించి కొన్ని ముఖ్యాంశాలు – సంక్షిప్తంగా.

1. Casual leave can be sanctioned for Half day also i.e., 10 30 AM to 1-30
PM or 2 PM to 5 PM (Note 3 under G.O.Ms.No. 112, Finance Department, dated
03-06-1966.) 2. An employee who is on Authorised leave can be
recalled 
back to duty by cancelling leave sanctioned and in such cases
the 
employee is eligible for T.A. (F.R.70).

Flash...   Hall Tickets for Departmental Tests May 2020 Session

3. Interim relief should not be paid in surrender leave. (Govt. Memo. No.
31948/398/PCI/1/98-1, F&P department, dated 12-08-1998.www.teacherinfo.in

4. Study leave to S.Cs & STS-Government in G.O.Ms.No. 342 (S.W. B3),
Finance Department, dated 30-08-1977 has issued orders to the effect, that
where acquiring higher educational qualifications are pre requisite for
promotion in respect of S.Cs and STs are required; they can be permitted to
acquire higher qualifications within the country with full pay and
allowances and without loss of leave. However such of the employees who have
put in not less than five years of service are eligible for such benefits
and that too once in service only. Necessary bond has to be executed to the
effect that they will serve the government after acquiring higher
qualification.

A:- Applies for N.G.O. category

B: Two years or less duration thout of leave. 

C: Two chances for qualifying Examination.

D:- Should come back to department or else Rs. 10,000/ penalty.

E: Only one such training programme.

5. According to sub rule 10 Annexure II of FR 74, the Medical Certificate
should be obtained by the Gazetted officers, not below the rank of a civil
surgeon and in respect of N.G.Os and last grade servants, it should be
obtained from any Registered Medical Practitioner.www.teacherinfo.in

6. According to FR 26 (b) (ii); the Head of the Department is competent to
permit the extra ordinary leave on M.C. to be counted for the purpose of
allowing increment up to six months; and after that the government.

7. Leave generally should not be refused. Although leave cannot be claimed
as a matter of right under FR 67, leave should not normally be refused
unless such refusal is absolutely necessary (Govt. Mcmo. No.
160808/695/FRI/165-1, Finance Department, dated 12-05-1965.)

8. Subject to limit of ten days, the authorised holidays can be availed
when they occur between dates on which compensatory leave is taken. The
restriction of maximum period of 10 days does not apply when compensatory
leave is prefixed or affixed to regular leave, but will apply only when
compensatory leave is combined with casual leave or authorised holidays
(Govt. Memo. No. 2690/ Political B/64-2, GAD, dated 03-10-1964).

9. Extra ordinary leave can be sanctioned at a time for five years or with
break up periods if they secure a job in foreign countries (GO.Ms.No. 756,
Finance (FRI) Department, dated 10 08-2002.).

10. In the case of grant of casual leave to a purely temporary and
emergency government servants, the sanctioning authority shall 
use its discretion having regard to length of service put in by such
government servant. (GO.Ms.No. 999, Finance, dated 30-5-1959).teachrinfo.i.n

11. Local Holidays notified in the District Gazettes cannot be permitted to
be prefixed or affixed to leave (sub rule 3 FR 68). 12. A government servant
cannot be compelled against his 
wishes to take leave on Half pay when on full pay is admissible
to 
him (Ruling under FR 67).

13. A government servant should produce physical fitness certificate to
return to duty after leave on Medical Certificate (FR 71).

14. A government servant on leave is prohibited to return to duty before
the expiry of leave granted to him unless is permitted to do so by the
authority which 
teachrinfo.i.n granted the leave (FR 72).

15. Leave may not be granted to government servant under suspension (FR
55)

16. Leave ordinarily begins on the day on which transfer of charge effected
and ends on the day preceding the day on which charge is resumed (FR
68).

17. The order sanctioning earned leave/Half pay leave to a
government servant shall indicate the balance of such leave at credit (Para
6 of G.O.Ms.No. 384, Finance and Planning Department, dated
05-11-1977.).

18. Commuted leave:– The commuted leave should be sanctioned only on
Medical Certificate. The period sanctioned should not exceed half the number
of days of half pay leave at credit (Rule 15 B; Rule 23; Rule 25 of A.P.
Leave Rules, 1933).
teachrinfo.i.n

A:- Commuted leave once sanctioned and availed of cannot be revised in to
leave on half pay even at the request of the government servant since the
option exercised in such case is final. (General ruling 10 in Annexure III
under A.P. Leave Rules, 1933.)

Leaves Related to Treatments and Diseases

1 Comment

  1. పి. వి మధుసూదన్

    నేను 1998 DSC ద్వారా ఇటీవలే (ఏప్రిల్13, 2023)contract with MTS పద్ధతిలో ఉద్యోగములో చేరితిని. అయితే ఈ విద్యా సంవత్సరం లో ఎన్ని సెలవులను అర్హత పొందుతాను?

Comments are closed