New Vaccine:ఈ వ్యాక్సిన్‌ రూ.150కే

 

కరోనాకు చెక్‌ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… 

త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి వరకు ఉన్న టీకాలకంటే అతి తక్కువ ధరకే.. ఈ టీకా ఉండబోతోంది.. గతంలో రెండు డోసులు కలిపి రూ. 650లోపే ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది.. తాజాగా దీనిపై ప్రభుత్వ అధికారుల నుంచి అందుతోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒక్కో డోసు ధర రూ. 150కే అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది.. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటికే 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్ కూడా ఇచ్చేసింది.. టీకాలు అందుబాటులోకి వస్తే మాత్రం.. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న అతి చవకైన వ్యాక్సిన్ బయోలాజికల్‌-ఈ దే కానుంది

Flash...   Collecting data from aided Schools - Revised instructions and online form