No registration for vaccine: వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు: ప్రభుత్వం.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా వాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా ఎటువంటి బుకింగ్ అవసరం లేదని వెల్లడించింది.

 

అయితే పల్లెటూర్ల లో వ్యాక్సినేషన్ ముందుగా బుక్ చేసుకోవడం లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 18 ఏళ్లు దాటిన ఎవరైనా సరే డైరెక్ట్ గా వాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని చెప్పింది కేంద్రం.

రిజిస్ట్రేషన్ చేయించుకుని డైరెక్ట్ గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఎటువంటి బుకింగ్ అవసరం లేదు గమనించండి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఆశ వర్కర్స్ లేదా హెల్త్ వర్కర్స్ ఊళ్ళల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలియజేశారు.

వాక్సినేషన్ రిజిస్టర్ కోసం 1075 డైల్ చేసి కూడా వాక్సిన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఏ విధాలుగా అయినా సరే వ్యాక్సిన్ వేయించుకోవడానికి సులువుగా ఉంటాయని ఇబ్బంది లేకుండా రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకో వచ్చు అని కేంద్రం చెప్పింది.

జూన్ 13 నాటికి, కోవిన్‌లో నమోదైన 28.36 కోట్ల మంది లబ్ధిదారుల లో, 16.45 కోట్ల (58%) లబ్ధిదారులు ఆన్-సైట్ మోడ్‌ లో నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే, జూన్ 13, 2021 నాటికి కోవిన్‌ లో నమోదైన మొత్తం 24.84 కోట్ల వ్యాక్సిన్ మోతాదులలో, 19.84 కోట్ల మోతాదులు (మొత్తం టీకా మోతాదులలో దాదాపు 80%) ఆన్‌సైట్ / వాక్-ఇన్ టీకా ద్వారా తీసుకున్నారు. అదే విధంగా గిరిజన ప్రాంతాలలో కూడా వ్యాక్సిన్ ని ఎక్కువ మంది వేయించుకున్నారు.

Flash...   Airtel కు RBI శుభవార్త.. కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఇవే!