Online classes :Online క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి.

బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి

కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్‌ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ లు తీసుకొస్తున్నాయి.

FULL HD  డిస్‌ప్లే స‌రిపోతుంది


ల్యాప్‌టాప్‌ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్‌ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్‌ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు.

ప్రాసెసర్ ముఖ్యమే


ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్‌ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్‌ తీసుకుంటే మంచిది.

RAM  ఎంత అవసరం


మీ ల్యాప్‌టాప్‌ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. 

HARD DISK DRIVE ఎంత ఉండాలి


మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్‌ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే  512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్‌ తీసుకోండి.

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Operating System, (OS)


మీ ల్యాప్‌టాప్‌ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది.

Flash...   రోజుకు రూ.100తో రూ.15 లక్షల కారు కొనేయండిలా!