Petrol Diesel Price: వాహనదారులకు షాక్‌.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

 

Petrol Diesel Price: పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. చమురు కంపెనీలు వాహనదారులపై తీవ్ర భారం మోపుతున్నాయి. దేశ వ్యాప్తంగా శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి ధరలు చేరాయి. శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచాయి. తాజా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు చేరింది. లీటర్ డీజిల్‌ రూ.86.75కు పెరిగింది. ఈనెలలో ఇప్పటి వరకు జూన్‌లో ఆరు సార్లు ధరలు పెరుగగా, మే 4 నుంచి ఇప్పటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు ధరల పెరుగుదలతో జనం హడలెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా, డీజిల్‌ కూడా రూ.100 వైపు పరుగులు పెడుతోంది. దేశంలోనే అత్యధికంగా శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.106 మార్క్‌ను దాటగా, డీజిల్‌ ధర రూ.99 దాటింది. మరో వైపు నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 0.21 డాలర్లు తగ్గి.. 72.31 డాలర్లకు చేరుకుంది. యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు 0.21 తగ్గి.. 70.08 డాలర్ల వద్ద స్థిరపడింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు:

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.95.85.. డీజిల్‌ రూ.86.75

ముంబైలో పెట్రోల్‌ రూ.101.04.. డీజిల్‌ రూ.94.15

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56

కోల్‌కతాలో రూ.95.80.. డీజిల్‌ రూ.89.60

చెన్నైలో పెట్రోల్‌ రూ.97.19.. డీజిల్‌ రూ. 91.42

బెంగళూరులో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.91.97

పాట్నాలో పెట్రోల్‌ రూ.97.95.. డీజిల్‌ రూ.92.05

చండీగఢ్‌లో రూ.92.19.. డీజిల్‌ రూ.86.40

లక్నోలో పెట్రోల్‌ రూ.93.09, డీజిల్‌ రూ.87.15.

Flash...   APPSC departmental test hall ticket download 2022