అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్ర భుత్వ పాఠశాలలకు జూలై ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాలని విద్యాశాఖ మంత్రిడా. ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఆ “కరోనా కర్ఫ్యూ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడం ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభం పై ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ 5 జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు పాఠశాలల ప్రారంభానికి సంబంధించి సన్నాహక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని విధివిధానాలు జారీ చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. వివిధ రాష్ట్రా నిర్ణయాలు తీసుకుంటున్నారా, విద్యా సంవత్సరం ప్రారంభంపై ఎలాంటి ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో. పరిశీలించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకి కులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని , మద్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ అంశంపై చర్చించారు.
కొన్ని జిల్లాల్లో సీఎఫ్ఎంఎస్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని, మరికొన్ని జిల్లాలకు పేమెంట్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వివరించారు. అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసే రూ. 15 వేలలో టాయిలెట్ మెయింటెనెన్సు కింద రూ. వెయ్యి మినహాయిస్తున్న నేపథ్యంలో ఆ ఫండ్ వినియోగం ఏ విధంగా చేయాలో చర్చిం చారు. Sanitation కోసం నియమించు కున్న ఆయాలకు చెల్లించాల్సిన వేతనాలు, సెలవు రోజుల్లో వారి సేవలు ఎలా వినియోగిం చుకోవాలనే అంశా లపై కూడా త్వరగా విరిచి దానాలు తయారు చేయాలని మంత్రి సురేష్ అధికారులకు సూచించారు. సమీక్షలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ వాడ్రేవు చిన్నవీరభద్రుడు, సమగ్ర శిక్ష SPD వెట్రిసెల్వి మధ్యాహ్నభోజన పధకం డైరెక్టర్ దివాన్ పాల్గొన్నారు.