SSC EXAMS: AP పది పరీక్షలు జులై26:CSE ప్రతిపాదనలు.

AP Tenth Exams : ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు. జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

టెన్త్ పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని చెప్పారు. 4వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. పరీక్షల నిర్వహణలో 80వేల మంది టీచర్లు, సిబ్బంధి పాల్గొంటారని వెల్లడించారు. కాగా, 11 పేపర్ల బదులు 7 పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచించాం అన్నారు.

సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

గతేడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.

పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందని వీరభద్రుడు చెప్పారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. రేపు(జూన్ 17,2021) విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

Flash...   ఈ నెలాఖరులోగా PRC పై నిర్ణయం ..PRC పై 18, 19 తేదీల్లో సమావేశం