SSC/INTER ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..

 

ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ పరీక్ష‌లపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  జులై నెల‌లో పరీక్ష‌ల నిర్వాహ‌ణపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలియ‌జేసింది.  ప‌రీక్ష‌ల‌కు 15 రోజుల ముందే స‌మాచారం ఉంటుంద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  జూలైలో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి కరోనా తీవ్రత తగ్గిందని భావిస్తే అప్పుడు ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది

 ప్ర‌భుత్వం త‌ర‌పు వాద‌న‌లు విన్న త‌రువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది.  మే మొద‌టి వారంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించినా క‌రోనా విజృంభిస్తుండ‌టంతో వాయిదా వేశారు.  ఆ త‌రువాత, మ‌రోసారి కూడా ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది.  దీంతో ప‌రీస్థితుల‌ను బట్టి జులై నెల‌లో పరీక్ష‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఏపీ స‌ర్కార్ తెలియ‌జేసింది.

Flash...   MLC - East- West Godavari Teachers' Constituency NOTIFICATION