Teacher Attendance through Mobiles

 ▪️మొబైల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల హాజరును మొబైల్ ఫోన్లోనే నమోదు చేసేలా యాప్ను రూపొంది స్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభ ద్రుడు వెల్లడించారు. యాప్ల వినియోగానికి సంబంధించి వారం, పది రోజుల్లో మరో సమావేశం నిర్వహించను న్నట్లు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సోమ వారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు.. 

• నెలవారీ పదోన్నతుల్లో కేటగిరి 3, 4 మాత్రమే భర్తీ చేస్తారు కొవిడ్-19 బారినపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు అర్హులైన ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాధికారులుగా పదోన్నతి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయడమా? లేదంటే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడమా? అనే దానిపై త్వరలో నిర్ణయం 

• పాఠశాలలు జులై 1న పునఃప్రారంభం 

• మండల విద్యాధికారుల బది లీలపై త్వరలో నిర్ణయం.


Flash...   SOP FOR MID DAY MEALS AND SCHOOL SANITATION