Traffic Fine: టైటానిక్ విన్యాసాలు.. ఒక్క ఫోటో.. రూ.3600 జరిమానా..!

రోడ్డుపై కుర్రకారు విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సముద్రాల్లో షిప్‌లను నడిపినట్లుగా రోడ్డు మీ బైక్‌లను నడిపేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా ఇటువంటి టైటానిక్ విన్యాసాన్ని గుర్తించి భారీ ఛలాన్ వేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. 

Rs 3,600 Fine: రోడ్డుపై కుర్రకారు విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సముద్రాల్లో షిప్‌లను నడిపినట్లుగా రోడ్డు మీ బైక్‌లను నడిపేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా ఇటువంటి టైటానిక్ విన్యాసాన్ని గుర్తించి భారీ ఛలాన్ వేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు మీరితే ఫైన్‌లు తప్పవూ అని చెబుతున్నా వినని వాళ్లకు బుద్ధి వచ్చేలా వారి ఫోటోను పబ్లిక్‌గా ట్విట్టర్‌లో పెట్టారు.

హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసుల కెమెరాలకు చిక్కములే అని అనుకుంటూ బండి నడుపుతున్న ఓ బైక్‌ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. హైద‌రాబాద్‌కు చెందిన ముగ్గురు యువ‌కులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు చేస్తూ దొరికిపోగా.. ఆ ఫొటోను సైబ‌రాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువ‌కులు ఓ బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్తూ.. మ‌ధ్యలో కూర్చున్న వ్యక్తి త‌న రెండు చేతుల‌ను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందుకు పెట్టి, మొబైల్ ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తూ బండి నడుపుతున్నాడు. ఇంత కోవిడ్ టైమ్‌లో మాస్కులు కూడా సరిగ్గా పెట్టుకోలేదు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు.. ‘‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. ప‌ట్టుత‌ప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించని యువకులకు ఆరు ఛలాన్లను వేశారు పోలీసులు.. దాని విలువ ఎంతంటే రూ. 3600, బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని కారణంగా రూ. 200, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.వెయ్యి బ‌హిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధ‌రించ‌నందుకు రూ.వెయ్యి, డ్రైవ‌ర్ వెనుక ఉన్న వ్యక్తి హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా రూ.100, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ.3,600 అయ్యింది.

రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు.
పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ

— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021

Flash...   వెల్లుల్లి టీ తాగేవారు జీవితాంతం బలంగా ఉంటారు..! తయారీ విధానం, లాభాలు ఏంటంటే..