world blood donor day -2021 : రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..?

 world blood donor day -2021 : రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..? మీరు ఈ రోగాల నుంచి తప్పించుకోవచ్చు..


world blood donor day -2021 : ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జూన్ 14 న జరుపుకుంటారు.

world blood donor day -2021 : ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జూన్ 14 న జరుపుకుంటారు. అవసరమైన రోగులకు సురక్షితమైన రక్తం దాని ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి క్రమం తప్పకుండా రక్తదానం చేయవలసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. రక్తం దానం చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పే సందర్భం కూడా ఇదే. చాలామంది స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ప్రోత్సాహకంగా కూడా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రక్త దానం అనేక ప్రాణాలను రక్షించగలదు కానీ చాలా సార్లు రక్తమార్పిడి అవసరమయ్యే రోగులు సురక్షితమైన రక్తాన్ని పొందలేరు. ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు రక్తదానం చేసి సేవ్ చేయవచ్చు. రక్తదానం ప్రాణాలను కాపాడటమే కాకుండా దాతకు కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

బరువు తగ్గడం: సకాలంలో రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పెద్దలలో ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఒక పింట్ రక్తం దానం చేస్తే 450 మి.లీ మీ శరీరం 650 కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కానీ దీనిని బరువు తగ్గించే ప్రణాళికగా భావించకూడదు లేదా ప్రోత్సహించకూడదు. ఆరోగ్య సమస్యలను నివారించడానికి రక్తదానం చేసే ముందు డాక్టర్ సంప్రదింపులు తప్పనిసరి.

హిమోక్రోమాటోసిస్‌ను నివారిస్తుంది : రక్తదానం చేయడం వల్ల హేమోక్రోమాటోసిస్ అభివృద్ధిని నిరోధించవచ్చు. ఈ పరిస్థితిలో శరీరంలో ఇనుము అధికంగా శోషించబడుతుంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఐరన్ ఓవర్‌లోడ్ తగ్గుతుంది. అందువల్ల హిమోక్రోమాటోసిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది : క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఇనుము స్థాయిలను తనిఖీ చేయవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పెద్ద మొత్తంలో ఐరన్ బిల్డ్-అప్ ఆక్సీకరణ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది వృద్ధాప్యం, గుండెపోటు, స్ట్రోకులు రాకుండా నిరోధిస్తుంది.

Flash...   Teachers' E-Hazaru app

తక్కువ క్యాన్సర్ ప్రమాదం: శరీరంలో ఇనుము అధికంగా ఉండటం క్యాన్సర్‌కు ఆహ్వానం. రక్తదానం చేయడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన ఇనుము స్థాయిని కాపాడుకోవచ్చు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

కొత్త రక్త కణాల ఉత్పత్తిని పెరుగుతుంది : రక్తదానం కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రక్తదానం చేసిన తరువాత ఎముక మజ్జ సహాయంతో 48 గంటలలోపు మీ శరీర వ్యవస్థ పని చేస్తుంది. కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి పోగొట్టుకున్న ఎర్ర రక్త కణాలన్నీ 30 నుంచి 60 రోజుల వ్యవధిలో భర్తీ చేయబడతాయి. అందువల్ల రక్తదానం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.