వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం..

లక్నో: కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ వంటి చర్యలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు చూచిస్తున్నప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కొంతమంది ఆసక్తి చూపించడం లేదు. అంతేగాక వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు.

ఇలాంటి సమయంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు నెల జీతం పొందలేరని బుధవారం ఫిరోజాబాద్‌ అధికారులు తెలిపారు.

 మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్..’నో వ్యాక్సిన్ నో శాలరీ’కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారన్నారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల లిస్టును సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసకుంటుందని,జీతాన్ని నిలిపివేస్తుందని జిల్లా చీఫ్​ డెవలప్​మెంట్ ఆఫీసర్ తెలిపారు. అయితే టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు ప్రకటించడంతో.. సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు

Flash...   DA ARREAR CALCULATOR