పాఠశాల విద్య డైరెక్టర్ పై విచారణ

 


♦అక్రమ అధికారులకు అండదండలు

♦సిబ్బందిని వేధిస్తున్నారన్న ఫిర్యాదులు

♦విచారణాధికారిగా ఇంటర్ బోర్డు కమిషనర్.

అమరావతి, జూలై 7(ఆంధ్ర జ్యోతి): పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యాశాఖలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ అధికారులకు అండగా నిలుస్తున్నారని, దళిత ఉపా ధ్యాయులను వేధించారని ఆరోప ణలు వచ్చాయి. దీనితో పాటు ఆయన శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన నాటికాలంలో అవినీతి జరిగిందని, విద్యాశాఖలో అవినీతిప రులైన వారికి పదోన్నతులు కల్పించారని వచ్చిన ఫిర్యాదుల న్నింటిపైనా విచారణకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బుడితి రాజశేఖర్ ఆదేశించారు. ఇంటర్ బోర్డు కమిష నర్ వి. రామకృష్ణను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్త రులిచ్చారు. చినవీరభద్రుడిపై పలు ఆరోపణలతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్కు కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు తేనె సాయిబాబా ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన | రాజశేఖర్ విచారణకు ఆదేశించారు.

ఇవి ఆరోపణలు….

చినవీరభద్రుడిపై వచ్చిన ఆరోపణల్లో ప్రధానంగా జగ నన్న విద్యాకిట్ల పంపిణీ కుంభకోణం, అనేక అక్రమాలకు పాల్పడి జైల్లో కూడా ఉన్న మువ్వా రామలింగం అనే వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా అర్జేడీగా పదోన్నతి కల్పించడం. దళిత ఉపాద్యాయుడు తేనె సాయిబాబాకు 5 నెలలుగా జీతం ఇవ్వకుండా వేధించడం తదితరాలున్నాయి. ఐటిడిఏ పీవోగా పనిచేసిన సమయంలో దినసరి వేతనంపై పనిచేసే 19మందిని చినవీరభద్రుడు రెగ్యులరైజ్ చేశారని.. ఈ వ్యవహారంలో రూ.50 లక్షలు. చేతులు మారాయని  సాయిబాబా ఆరోపించారు. మానవతా ధృక్పదంతో చేశా. నంటూ ఆయన కేసు నుంచి తప్పించుకున్నారని, కానీ ఆ 19మందికి జీతాలు మంజూరు చేసిన ట్రెజరీ అధికారులను మాత్రం సస్పెందే చేశారని ఆయన తనపిరాదులో తెలిపారు.

Flash...   Fact Check: This video is not of villagers chasing away Covid vaccination squads