వారికి ఒక్క డోసు చాలు.. డెల్టా వేరియంట్‌ నుంచి కూడా రక్షణ. ICMR

 

ICMR study: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్‌లోని మరో ప్రమాదకర వేరియంట్.. డెల్టా ప్లస్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదకర వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను నియంత్రించేందుకు మార్గం వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఒక కీలక అంశం వెల్లడయ్యింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో… కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిని పోల్చిచూస్తే వీరు డెల్టా వేరియంట్ నుంచి అత్యధిక రక్షణను పొందుతున్నారని వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే కరోనా నుంచి కోలుకున్నవారు.. ఒక్క డోసు టీకా తీసుకున్నా వారికి వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ శనివారం తెలిపింది. హిమోరల్ అండ్ సెల్యూలర్ ఇమ్యూనిటీ అనేది డెల్టా వేరియంట్‌పై పోరాడుతూ రక్షణ అందివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఇది ఇతర వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇదిలాఉంటే.. దీనికిముందు ఐసీఎంఆర్ భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాల గురించి ఒక రిపోర్టును వెలువరించింది. దానిలో.. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని వెల్లడించింది. దీనికి ముఖ్యంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడమే కారణమని తెలిపింది. దీనివలన భవిష్యత్‌లో వచ్చే మరిన్ని వేవ్‌ల ప్రభావం తక్కువగా ఉండబోతోందని ఐసీఎంఆర్ పేర్కొంది. థర్డ్ వస్తుందన్న అధ్యయనాల నేపథ్యంలో.. ఐసీఎంఆర్ పలు సూచనలు చేసింది. థర్డ్ వేవ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది

Flash...   Conduct of 15 days Fitness Training and 30 days discipline wise sports training in all Schools