విద్యా వ్యవస్థలో గందరగోళం

♦ఏకపక్షంగా ప్రభుత్వ నిర్ణయాలు

 ♦రోజుకో విధానంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన

 🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

పాఠశాల విద్యా వ్యవస్థలో అంతా గందరగోళం నెలకొంది. రోజురో విధానాన్ని ప్రవేశపెడుతూ అందరినీ ప్రభుత్వం అయోమయంలో పడేస్తోంది. ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో పాఠశాల విద్యను ప్రభుత్వం ఏం చేస్తుందోననే ఆందోళన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావుల్లో నెలకొంది. 5+3+3+4 విధానంలో మూడు రకాల పాఠశాలలు ఉంటాయని మే 31న విద్యాశాఖ 172 సర్క్యులర్ను ఏకపక్షంగా విడుదల చేసింది. ఈ సర్క్యులర్లో 3, 4, 5 తరగతులను దూరంగా ఉన్న హైస్కూళ్లకు తరలిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయానికి ముందు ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులతో ప్రభుత్వం చర్చించలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ విధానం వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయని, ఉపాధ్యాయుల సంఖ్య కుదించం దుతుందని పెద్ద ఎత్తులో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని beb -గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. ఈ సమావేశంలో కూడా అన్ని సంఘాలూ తరగతుల విభజనను వ్యతిరేకించాయి. విద్యాశాల అధికారులు కూడా ఈ విధానంపై క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే ఇబ్బందులు గుర్తించినట్లు తెలుస్తోంది. 3. 4. 5 తరగతుల విద్యార్థులను దూరంగా పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించరని గమనించారు. తరలించడం వల్ల హైస్కూళ్లలో తరగతి గదుల సమస్య వస్తుందని బావించారు. ఈ అంశాలను గుర్తించి మూడు పాఠశాలల విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మూడు రకాల స్కూళ్లపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్తగా 6 రకాల పాఠశాలల విదానం తీసుకొస్తుంది. ఈ విధానంపై కూడా విద్యాశాఖ ఎవరితోనూ చర్చించలేదు. ఇప్పుడు ఈ పాఠశాలలు ఎలా ఉండబోతున్నాయి? ఉపాధ్యాయుల సద్దుబాటు ఎలా ఉంటుందనే అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

♦సీఎంను పక్క దారి పట్టిస్తున్న అధికారులు!

 నూతన విద్యా వ్యవస్థపై అధికారులు సిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారకే చర్చ విద్యాశాఖలో నడుస్తోంది. తరగతుల విభజనపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన అంశాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి అందరితోనూ చర్చలు జరిపామని, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు స్వాగతిస్తున్నారని, నాడు-నేడు సమీక్షలో అధికారులు సిఎంకు తప్పుడు సమాచారం అందించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఫౌండేషన్ స్కూళ్లు, నూతన విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాల ఒకసారి మాత్రమే సమావేశం ఏర్పాటు చేసింది. కానీ అధికారులు మాత్రం విస్తృతంగా చర్చలు జరిపామని సిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని నాయకులు చెబుతున్నారు.

Flash...   CHANGE OF NAME OF INDIA: INDIA పేరు మార్పుపై పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న!