ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

 

విద్యారంగంలో నాడు- నేడు, విద్యాకానుకలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలన్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న ఆగస్టు15 లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుంది. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాధ్యాయుడు పోస్టు తగ్గదు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. నాడు-నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. 30 శాతం పదో తరగతి , 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామన్నారు. ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Flash...   Conduct of “Jawahar Navodaya Vidyalaya Selection Test” on 11th August, 2021