3rd WAVE: మళ్ళీ ముంచుకొస్తుంది . పాఠశాలల ప్రారంభం పై ఆందోళన

»రెండోదశ కొనసాగుతూనే థర్డ్ వేవ్ లోకి

»తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభం? 

» కేసులు నమోదులో మూడో స్థానంలో ఏపీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొనిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగు తోంది. గత వారం రోజులుగా తూర్పు, పశ్చిమగోదా వరి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుండగా.. మరో రెండు వారాల్లో అన్ని జిల్లా ల్లోనూ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దర్జ్ వేవ్ కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభమవుతుందని అంచనా కరోనా మొదటిదశ ముగిసి రెండో దశ ప్రారంభానికి మధ్య 4నెలల వ్యవధి ఉంది. కానీ ఇప్పుడు రెండోదశ కొనసాగుతున్న సమయంలోనే మూడో దశ ప్రారంభమవుతోంది. ఇప్పటికే జిల్లాల్లో వైరస్ లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత వారం వరకూ రోజుకు 5 నుంచి 10మంది ఆస్పత్రుల్లో చేరగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15 నుంచి 20కి పెరిగింది. తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, కృష్ణా నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. పలువురు బాధితులు ప్రైవే గా పరీక్షలు చేయించుకుంటూ, పాజిటివ్ వచ్చినా. ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా వైద్యులను సంప్రం దించి చికిత్స పొందుతున్నారు. 

ఈ రోజు 30.07.2021 covid రిపోర్ట్

అదే నిర్లక్ష్యం

రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైనట్లు వైద్య నిషణులు అంటున్నారు. ఆగస్టు మొదటివారం నుంచి కేసుల సంఖ్య మరింత పెరిగే అవ కాశం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నా హాలు చేస్తోంది. సెకండ్ వేవ్లో ఈ నిర్లక్ష్యమే ముంచింది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపో యినా విద్యాసంస్థలు తెరిచారు. ప్రజలు కూడా నిబం దనలు గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది మృత్యువాతపడ్డారు. సెకండ్ వేవ్ బిజిత్వానికి పాఠశాలలు, కళాశాలలు నిర్వహించడమే ప్రధాన కారణం ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అదే తప్ప చేస్తోంది. కేరళ, మహారాష్ట్రలో మూడు వారాల క్రితమే మూడో దశ ప్రారంభమైంది. అక్కడ కేసులు పెరగడం ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల్లో ఇతర రాష్ట్రా “లకు వైరస్ విస్తరిస్తుంది. మొదటి రెండో దశలో ఇదే విధంగా కౌవిడ్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కేరళలో సగటున 2వేల కేసులు నమోదవుతున్నట్లు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో సంఖ్య 6వేలకు పైగానే ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతు న్నారు. 

Flash...   PRC పీటముడి: ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీతో భేటీ.. సర్కార్ ముందు 3 డిమాండ్లు

APP  తో నష్టం 

కరోనా మొదటి దశలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికా రులు పకడ్బందీగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్లలో జాయింట్ డైరె క్టర్ కేడర్ స్థాయి అధికారులను నియమించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ టెస్టింగ్, ట్రీట్మెంట్ మొత్తం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆశా ఏఎన్ఎలల సహకా రంతో కొవిడ్ను నియంత్రించడంతో కేసులు 10వేలకు మించలేదు. రెండోదశలో ఈ వ్యవస్థ మొత్తాన్ని తీసే శారు. ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు యాప్లు అప్ప గించి డేటా అప్లోడ్ వేయాలని సూచించారు. దీని వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ పూర్తిగా విఫల మయ్యారు. చాలామంది సిబ్బంది గ్రామాల్లో పర్యటిం చకుండానే యాప్ డేటా అప్లోడ్ చేసేశారు. సెకండ్ వేవ్లో ఆరోగ్యశాఖ సమర్పించిన డేటా మొత్తం తప్పులతడక క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, ఆరోగ్యశాఖ నివేదికలకు పొంతన లేదు యాప్లపై ఆధారపడటం వల్లే ఈ పరిస్థితి. మూడో దశలో అయినా యాప్లపై ఆధారపడకుండా మానవ వనరు లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.