Curfew: AP లో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..

 

ఏపీలో కరోనా కేసులు గత రెండు వారాల నుంచి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7 వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. అ తర్వాతి నుంచి కొత్త ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త ఆంక్షల ప్రకారం… తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.

అలాగే… సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది సర్కార్‌. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఈ రెండు జిల్లాల్లో ఆంక్షల కొనసాగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకూ సడలింపులు ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే… రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది

Flash...   Whatspp: సైలెంట్ గా కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. మీ యాప్‌లో ఈ తేడాను గమనించారా.?