School Readiness Guidelines by CSE

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ

ప్రభుత్వ మెమో నంబరు: 1441536/Prog.II/A1/2021-2 తేది. 03.07.2021

విషయం:పాఠశాల విద్య COVID-19 ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు పాఠశాల సంసిద్ధత తగు సూచనలు జారీ

నిర్దేశములు: ఉత్తర్వులు, పాఠశాల విద్య, 1441536/Prog.lI/A1/2021, Dt: 30. 06. 2021

1. పై సూచిక నందు 2021-22 విద్యా సంవత్సరానికిగాను, పాఠశాల సంసిద్ధత ప్రణాళిక తయారీకి, బోధన అభ్యాస ప్రక్రియ కు సూచనలు మరియు మార్గదర్శకాలను జారీ చేయడమైనది. సదరు సూచనలను అనుసరించి 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభానికి గాను, విద్యార్థులు ప్రత్యక్ష బోధనాభ్యసన లో పాల్గొనేంత వరకు ఈ దిగువ మార్గదర్శకాలను సూచించడమైనది.

ప్రాధమిక సన్నాహక సమావేశం

2.   05.07.20 గ్రామంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ గ్రామ / వార్డు సచివాలయాన్ని సందర్శించి సదరు కార్యదర్శి తో సమావేశం జరిపి ప్రస్తుతం కోవిద్ పరిస్థితుల దృష్ట్యా విద్యా శాఖ ఆదేశాల మేరకు సదరు పాఠశాల రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను చర్చించడానికి 06.07.2021 న విస్తృత స్థాయి సమావేశం నకు గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్ లను హాజరు కావలసిందిగా కోరాలి సదరు సమావేశంలో గ్రామ | వార్డు సచివాలయ సిబ్బంది ని, అంగన్వాడీ కార్యకర్తలను పాల్గొనమని కోరాలి. సమావేశ వేదికను సంయుక్తంగా నిర్ణయించాలి.

విస్తృత స్థాయి సమావేశం..

3. ది 06.07 2021 న ఆయా గ్రామాలలోని సంబంధిత గ్రామ సచివాలయ పరిధిలోని పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్. అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది. గ్రామ వాలంటీర్స్, మరియు పేరెంట్స్ కమిటీ లతో విస్తృత స్థాయి సమావేశం కోవిద్ నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించవచ్చు. ఈ సమావేశం లో పాఠశాల కోవిద్ ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక ను చర్చించాలి. ఈ సమావేశం లో ఈ దిగువ విషయాలు చర్చించాలి.

• గ్రామ సచివాలయ పరిధి లోని విద్యార్థుల జాబితా ను తయారు చేసుకోవాలి. అమ్మ ఒడి కోసం రూపొందించిన జాబితా ను సూచికగా తీసుకొన వచ్చు) 

Flash...   instructions on International Women's Day on 08.03.2021

• విద్యార్థుల సంఖ్య మరియు ఉపాధ్యాయుల సంఖ్య ను బట్టి విద్యార్థులను, ఉపాధ్యాయులను బృందాలు గా చేసి ఉపాధ్యాయ బృందాలకు విద్యార్థి బృందాలను అనుసంధానం చేయాలి ఉపాద్యాయ బృందం లో అంగన్వాడీ కార్యకర్తలను ఛఫ్ లను అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. ఈ ప్రక్రియ లో ఒక ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల సంఖ్య 15 కు మించకుండా చూడాలి. తప్పని పరిస్థితులలో విద్యార్థుల సంఖ్య ను పెంచుకోవచ్చు.

• ఈ ఉపాధ్యాయ బృందాలు, తమ కు కేటాయించబడిన విద్యార్థులకు ఏ ఏ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయో చూసుకొని, చురుకైన విద్యార్థులను చిట్టి నాయకులు / చిట్టి ఉపాధ్యాయులు గా పరిగణించి వారి ద్వారా ఉపాధ్యాయ బృంద పర్యవేక్షణ లేని సమయం లో సదరు విద్యార్థుల బృందం ప్రత్యమ్నాయ దాసు తోడ్పడేలా చూడాలి.

ఈ ప్రక్రియ లో విద్యార్థులకు ప్రభుత్వం అందిచే డ్రై రేషన్, మొదలైన ప్రయోజనాలు సకాలంలో అందిచడం తో పాటుగా, బడి బయటి విద్యార్థులను గుర్తించి వారిని కుడా ఈ ప్రత్యామ్నాయ విద్యా అభ్యాసన లో భాగస్వామ్యం చేయాలి.. 

• ది. 15 07 2021 నుండి జరగబోయే ప్రత్యామ్నాయ బోధనాభ్యసనకు రాష్ట్ర విద్యా శాఖ ద్వారా ప్రసారమయ్యే దూరదర్శన్ మరియు రేడియో కార్యక్రమాల వివరాలను విదార్థులకు తెలియజేయాలి. ఈ కార్యక్రమాలు తమ గ్రూప్ లోని విద్యార్థులందరూ వీక్షించే/ఆలకించే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలి.

విద్యార్థులకు వివిధ మాధ్యమాల ద్వారా అందుబాటులో గల డిజిటల్ కంటెంట్ ను సేకరించి వాటిని విద్యార్థులకు అందచేయాలి ( డిజ్జా నందు గల కంటెంట్ ను ఉపయోగించుకోవచ్చును) ఔత్సాహిక ఉపాద్యాయులు వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అందేలా చూడాలి. సదరు వీడియోలను ప్రసారం చేయడానికి స్థానిక కేబుల్ నెట్వర్క్ వారి సహాయం తీసుకోవచ్చును.

ఈ ప్రత్యామ్నాయ విద్యాభ్యాసం లో వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. * సాంకేతిక సహకారం కోసం స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సహకారం తీసుకోవచ్చును.

Download and Read More..

Flash...    SCERT, AP - Development of new textbooks - deputation of teachers