పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేయండి: ప్రజారోగ్య వేదిక

 


నెల్లూరు ప్రతినిధి, ఆగస్టు 14 (సదా మీకోసం) : ఆగస్టు – సెప్టెంబరు నెలల మధ్య కరోనా మూడవ అల ప్రమాదం | ముంచుకొస్తున్న దఅష్ట్యా ఆగస్టు 16 నుండి పాఠశాలలు ప్రారంభాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజారోగ్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు డా. యం. వి. రమణయ్య, టీ. కామేశ్వరరావులు లేఖ ద్వారా కోరారు. రెండవ అలలో కరోనా సఅష్టించిన బీభత్సాన్ని మరువక ముందే మూడవ అల కరోనా వస్తుందని, అలాగే ఈ దశలో కరోనా యొక్క నూతన వేరియంట్ ల వల్ల ప్రజల ఆరోగ్యంపై, ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని, ఇది ఆగస్టులోనే విజఅంభించే అవకాశం ఉందని వస్తున్న వార్తల వల్ల రాష్ట్రంలో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని ఆ లేఖలో తెలిపారు. ఇది నిజమే అన్నట్లు బెంగళూరు, లూధియానాలో పిల్లలకు ఎక్కువగా కరోనా సోకడం చూస్తున్నాం. 

ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన పాఠశాలలు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు తీసుకుంటున్న చర్యలు. అభినందనీయం, కానీ భవిష్యత్తు కంటే ప్రాణం ముఖ్యమని మీకు తెలియని విషయం ఏమీ కాదని, పాఠశాలలు తెరిచేందుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ఈ మహమ్మారి కరోనా మూడవ అల ముఖ్యం విద్యార్థుల మీద ప్రభావం ఉండబోతోందన్న పలువురు మేధావుల సూచనలు పరిగణలోకి తీసుకొని మూడవ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందో కొన్ని రోజులు ఆగి చూసిన తరువాత పాఠశాలలు ప్రారంభిస్తే మంచిదని ప్రజారోగ్య వేదిక కోరింది. మా అభిప్రాయం. మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని -ముఖ్యమంత్రిని ఆ లేఖలో కోరింది.



Flash...   SBI Home Loan: పండుగ సీజన్​ రాకముందే SBI ఆఫర్లు