రేషన్ కావాలా ? పెన్షన్ కావాలా ? కార్డుకు ఒకటే పెన్షన్-మినహాయింపులివే

జగన్ సర్కార్ మరో ఝలక్- రేషన్ కావాలా ? పెన్షన్ కావాలా ? కార్డుకు ఒకటే పెన్షన్-మినహాయింపులివే..

ఏపీలో రేషన్ కావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే అంటూ కరోనాలోనూ లబ్దిదారుల్ని ఆధార్ కేంద్రాల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిప్పుతున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు తాజాగా మరో షాకి ఇచ్చింది. ఒకే రేషన్ కార్డుపై ఒకటికి మించిన పింఛన్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు లబ్ది దారులకు పలు జిల్లాల్లో నోటీసులు జారీ అవుతున్నాయి. వీటిపై సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం పింఛన్ల కోత తప్పదంటోంది. దీంతో రేషన్ కార్డు దారులతో పాటు పింఛన్ దారులూ బెంబేలెత్తుతున్నారు

షన్ కార్డు దారులకు చుక్కలు పేదలకు ఇచ్చే రేషన్ కార్డులకు ఈ కేవైసీ చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల్ని పరుగులు తీయిస్తోంది. రేషన్ కార్డుపై రేషన్ రావాలంటే తప్పనిసరిగా ఈకేవేసీ చేయించాలంటూనే.. దీనికి ఎలాంటి గడువు పెట్టలేదని రోజూ ప్రకటనలు జారీ చేస్తోంది. అసలే కరోనా సమయం, తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారులు పిల్లలతో కలిసి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇందులో ఏ తేడా వచ్చినా ఇకపై రేషన్ అందదన్న భయం వారిలో కనిపిస్తోంది.

Flash...   SCHOOL DEVELOPMENT PLAN 2023 - 24 (1-12 Classes)